తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై ఉమ్మడి పోరాటానికి వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మరో అడుగు ముందుకు వేశారు. ఇప్పటికే టీ సేవ్ ఫోరం ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల వివిధ రాజకీయ పక్షాలను కలిసి ఉమ్మడి పోరుకు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. టీ సేవ్ ఫోరం ఆధ్వర్యంలో ఐక్య కార్యాచరణ రూప కల్పన చేసేందుకు గాను రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు వైఎస్ షర్మిల. రేపు ఉదయం 10.30 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీలు, ప్రజా, యువజన, విద్యార్ధి సంఘాలు హజరుకానున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ యేతర పార్టీలతో టీ సేవ్ ఫోరం బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 1.91 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఈ పక్షాలు డిమాండ్ చేయనున్నాయి. అదే విధంగా కేంద్రం ఇస్తామని ప్రకటించిన 2 కోట్ల ఉద్యోగ హామీపైనా చర్చించనున్నారు. సమావేశంలో ఉమ్మడి ఉద్యమ కార్యాచరణ అజెండాను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ రాజకీయ పక్షాలు వేరువేరుగా నిరసనలు, ఉద్యమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి.
అయితే కేసిఆర్ సర్కార్ పై పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలంటే ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించాలని వైఎస్ షర్మిల భావించారు. ఆ క్రమంలోనే ముందుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు ఆమె నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. షర్మిల విజ్ఞప్తిలో పార్టీలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని ఈ ఇరువురు నేతలు వెల్లడించారు. అయితే బీజేపీ ఉంటే తాము పాల్గొనమని వామపక్షాలు తెలియజేశాయి. కాగా షర్మిల నేతృత్వంలో జరిగే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏయే రాజకీయ పక్షాలు పాల్గొంటాయి అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
వైఎస్ఆర్ జిల్లాలో విషాదం .. ఈత కోసం వెళ్లి ముగ్గురు మృతి