NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

ఎంపీకి కలెక్టర్ కౌంటర్..! బెజవాడ రాజకీయంలో ట్విస్టు

(విజయవాడ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)

విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ రాజకీయంలో పైచేయి సాధించాలనుకున్న టీడీపీ ఎంపి కేశినేని నాని ఆశలకు జగన్ ప్రభుత్వం నీళ్ళు చల్లింది. విజయవాడలో కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మాణం గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రారంభించినప్పటికీ దీనిలో విజయవాడ ఎంపి కేశినేని నాని ప్రత్యేక శ్రద్ధ కృషి ఉన్నాయి. టీడీపీ హయాంలో పనులు ప్రారంభించినప్పటికీ అది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తి అయిన విషయం తెలిసిందే.

kanaka durga flyover

అయితే ఈ ఫ్లైఒవర్ క్రెడిట్ తాను కొట్టేయాలని ఎంపి కేశినేని నాని ప్రారంభోత్సవానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కంటే ముందుగానే అప్ డేట్స్ ఇస్తూ వచ్చారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుసుకోవడం, ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వనించడం ఆ వివరాలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రజలకు తెలియజేయడం చేశారు. ఈ నెల 4వ తేదీన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం జరుగుతుందంటూ కేశినేని నాని ముందుగా ప్రకటించారు. అయితే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతితో సంతాప దినాలు కారణంగా ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ నెల 18 వ తేదీ ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ విషయన్ని ముందుగా కేశినేని నానే ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఆ తరువాతనే రాష్ట్ర మంత్రి శంకర నారాయణ మీడియాకు వెళ్లడించారు. అయితే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కరోనా బారిన పడటంతో నేటి కార్యక్రమం కూడా వాయిదా పడిందని నిన్న కేశినేని నాని ట్విట్టర్ వేదిగా వెల్లడించారు. అయితే ప్రజా ప్రయోజనాల దృష్యా నేటి నుండి ఫ్లైఓవర్ పై వాహనాల రాకపోకలు అనుమతులు ఇస్తున్నట్లు కేశినేని ప్రకటించారు. దీంతో విజయవాడ నగర వాసులు తమ ట్రాఫిక్ కష్టాలు తీరతాయని భావించారు.

kesineni Nani

ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపి కేశినేని నాని ప్రకటిస్తే అధికార పార్టీ నాయకులు, అధికారులు దానికి అంగీకరిస్తారా అనే అనుమానాలు వచ్చాయి. అనుమానాలు నిజం చేస్తూనే అధికారులు ఫ్లైఓవర్ పై వాహనాల రాకపోకలకు అనుమతించలేదు. ఫ్లైఓవర్ పై వాహనాల రాకపోకలకు నేటి నుండి అనుమతించడం లేదనీ జిల్లా కలేక్టర్ ఇంతియాజ్ తెలిపారు. వాహనాల రాకపోకలను ఎప్పటి నుండి అనుమతిస్తారనేది ఆర్ అండ్ బి అధికారులు నిర్ణయిస్తారని కలెక్టర్ తెలిపారు. తన హయాంలో నిర్మాణం ప్రారంభించినందున ఫ్లైఓవర్ క్రెడిట్ కోసం ఎంపి కేశినేని తాపత్రయ పడుతుండగా, తమ హయాంలోనే ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసినందున ఆ క్రెడిట్ తమదేనని అధికార వైసీపీ వర్గాల భావనగా ఉంది. అందుకే ఫ్లైఓవర్ పై వాహనాల అనుమతికి ఎంపి కేశినేని స్టేట్ మెంట్ ను కలెక్టర్ కొట్టిపారేశారు. అధికారులే నిర్ణయిస్తారంటూ వెల్లడించారు. చూస్తున్నారుగా రాజకీయం అంటే ఇది.

Krishna collector

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N