IAS Officers Transfer: 16 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం..

Share

IAS Officers Transfer: ఇటీవలే భారీగా ఐపీఎస్ లను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా 16 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు విడుదల చేశారు.. వైయస్సార్ జిల్లాతో పాటు తూర్పుగోదావరి, విజయనగరం, కర్నూలు, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ లను బదిలీ చేశారు..

16 IAS Officers Transfer: AP Government
16 IAS Officers Transfer: AP Government

విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ ను ఆర్ అండ్ ఆర్ కమిషనర్ గా నియమించారు. ఏపీ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.సూర్యకుమారి ని విజయనగరం జిల్లా కలెక్టర్ గా బదిలీ చేసి, ఆమె స్థానంలో కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండ్యన్ ను నియమించారు. వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గా ఉన్న హరి కిరణ్ ను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా నియమించారు. విశాఖ కలెక్టర్ వాడరేవు వినయ్ చంద్ ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియామకం చేసి, ఆయన స్థానంలో డాక్టర్ ఎ.మల్లికార్జున్ ను అపాయింట్ చేశారు. విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మెట్రోపాలిటన్ కమిషనర్ పి.కోటేశ్వరరావు ను కర్నూలు జిల్లా కలెక్టర్ గా బదిలీ చేసి, ఆయన స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి ని నియమించారు.

శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ ను పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ గా బదిలీ చేసి, ఈయన స్థానంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను నియమించారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి. మురళిధర్ రెడ్డి ని ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించారు. ఈ స్థానంలో ఉన్న విజయరామరాజు వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ను చిత్తూరు జాయింట్ కలెక్టర్ గా బదిలీ చేశారు. అలాగే ఎం.ప్రభాకర్ రెడ్డిని స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించారు..


Share

Related posts

రాణించిన బౌలర్లు-ఆసీస్ 191/7

Siva Prasad

పోరాటం ఉగ్రవాదంపైనే..కశ్మీర్‌పై కాదు – మోది

somaraju sharma

24 గంటల్లో అల్పపీడనం

somaraju sharma