NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

వామ్మో… ఇంత ఫాస్ట్ ఇంటర్నెటా? 178 టీబీపీఎస్ స్పీడ్.. ఒక్క సెకన్ లో వందల సినిమాలు డౌన్ లోడ్

178 tbps fastest internet speed created by London university researchers

ఈరోజుల్లో అన్నం లేకపోయినా బతుకుతామేమో కానీ.. ఒక్క నిమిషం ఇంటర్నెట్ లేకపోతే బతకలేం. మొబైల్ కు ఒక్క నిమిషం నెట్ రాకపోతే అతలాకుతలం అవుతాం. అంతలా ఇంటర్నెట్ మనలో భాగం అయిపోయింది.

178 tbps fastest internet speed created by London university researchers
178 tbps fastest internet speed created by London university researchers

ఇదివరకు ఒక్క సినిమాను డౌన్ లోడ్ చేయాలంటే కొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు 2జీ, 3జీని దాటి 4జీలో ఉన్నాం. ఇంకొన్ని రోజులైతే 5జీ స్పీడ్ కు కూడా వెళ్తాం.

ఈరోజుల్లో ఏ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నా.. 100 ఎంబీపీఎస్ స్పీడ్ వరకు ఉంటుంది. అదే మనకు ఎక్కువ స్పీడ్.

కానీ.. వీళ్లు చూడండి.. ఏకంగా 178 టీబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ ను సాధించారు. లండన్ యూనివర్సిటీ కాలేజీకి చెందిన పరిశోధకులు ఈ అచీవ్ మెంట్ సాధించారు.

178 టీబీపీఎస్ స్పీడ్ అంటే సెకన్ ను 178 టెరాబైట్స్ అన్నమాట. అంటే 1,78,000 జీబీ అన్నమాట. సెకన్ కాలంలో 178 టెరా బైట్ల వేగంతో వెళ్లే ఇంటర్నెట్ ను సృష్టించి పరిశోధకులు చరిత్రకెక్కారు.

ఈ స్పీడ్ ఇంటర్నెట్ కనుక ఉంటే.. ఒక్క సెకన్ లో కనీసం 200 సినిమాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చుప. అవి కూడా హెచ్ డీ ప్రింట్ ఉన్న సినిమాలు.

ఇలాంటి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే క్షణాల్లో అన్ని పనులు చక్కదిద్దుకోవచ్చు. దీనికంటే ముందు ఆస్ట్రేలియాలో 44.2 టీబీపీఎస్ నెట్ స్పీడ్ ను సాధించారు.

అయితే.. ఇంత స్పీడ్ ఇంటర్నెట్ ను ట్రాన్స్ ఫర్ చేయాలంటే ప్రస్తుతం ఉన్న ఆప్టికల్ ఫైబర్ కేబుల్ సరిపోదు. దానికోసం సపరేట్ గా హైరేంజ్ వేవ్ లెంత్స్ వాడాలి.

ఈ పరిశోధకలు ఇంకా ఏమంటున్నారంటే.. ఎన్ని టెరాబైట్ల స్పీడ్ ఇంటర్నెట్ అయినా సరే.. హైరేంజ్ వేవ్ లెంత్స్ వేసుకుంటే చాలు… ఖర్చు కూడా తక్కువే అంటున్నారు.

అయితే ఇంత స్పీడ్ ఇంటర్నెట్ సాధ్యం అవుతుందా? అదా? అనే టెస్ట్ మాత్రమే వీళ్లు చేశారు కానీ.. ప్రస్తుతం దీన్ని మార్కెట్ లోకి తీసుకురావడం లేదు. ఫ్యూచర్ లో ఒకవేళ ఇంత భారీ స్పీడ్ ఇంటర్నెట్ ఎక్కడైనా అవసరం ఉంటే అప్పుడు ఈ టెక్నాలజీని మళ్లీ సృష్టిస్తారన్నమాట.

author avatar
Varun G

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N