NewsOrbit
టెక్నాలజీ న్యూస్

ఇంట్లో వైఫై సిగ్న‌ల్ స‌రిగ్గా రావ‌డం లేదా ? ఇలా చేయండి..!

ప్ర‌స్తుతం ఇండ్ల‌లో చాలా మంది బ్రాడ్‌బ్యాండ్ ఇంట‌ర్నెట్‌ను వైఫై ద్వారా పొందుతున్నారు. అనేక ఇంటర్నెట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు వైఫై ద్వారా ఇంట‌ర్నెట్‌ను అందిస్తున్నారు. అయితే వైఫై కోసం వైఫై రూట‌ర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇంట‌ర్నెట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు కొంద‌రు వీటిని ఉచితంగానే ఇస్తారు. కొన్ని కంపెనీల‌కు గాను మ‌న‌మే వాటిని కొనాల్సి ఉంటుంది. అయితే కొంద‌రు ఇండ్ల‌లో వైఫై సిగ్న‌ల్ స‌రిగ్గా రావ‌డం లేద‌ని కంప్లెయింట్ చేస్తుంటారు. అందుకు గాను కింద తెలిపిన సూచ‌న‌లు పాటించాలి. దీంతో ఇంట్లో వైఫై సిగ్న‌ల్ మెరుగ‌వుతుంది.

how to boost wifi signal at home

* వైపై రూట‌ర్‌ను ఇంట్లో ఎప్పుడూ ఎత్తైన ప్ర‌దేశంలో ఉంచ‌డం వ‌ల్ల సిగ్న‌ల్ బాగా ల‌భిస్తుంది.

* కాంక్రీట్‌, మెట‌ల్, ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌కు దగ్గ‌రగా రూట‌ర్‌ను ఉంచితే సిగ్న‌ల్స్ స‌రిగ్గా రావు. క‌నుక ఆయా వ‌స్తువుల‌కు దూరంగా రూట‌ర్‌ను ఉంచాలి.

* ఇంట్లో స‌రిగ్గా మ‌ధ్య‌లో రూట‌ర్‌ను ఉంచితే ఇల్లు మొత్తానికి సిగ్స‌ల్స్ బాగా అందుతాయి. అందువ‌ల్ల వైఫై సిగ్న‌ల్ స‌రిగ్గా వ‌స్తుంది.

* ఒక‌టి క‌న్నా ఎక్కువ అంత‌స్థులు ఉన్న ఇంట్లో ఉంటే ఒక ఫ్లోర్‌లో రూట‌ర్‌ను ఉంచితే మ‌రొక ఫ్లోర్‌లో నెట్ స‌రిగ్గా రాదు. అందువ‌ల్ల రిపీట‌ర్ల‌ను వాడాలి. దీంతో వైఫై సిగ్న‌ల్ బూస్ట్ అవుతుంది. ఫ‌లితంగా ఇత‌ర ఫ్లోర్ల‌లోనూ వైఫై సిగ్న‌ల్ బాగా అంది నెట్ స‌రిగ్గా వ‌స్తుంది.

* మైక్రోవేవ్ ఓవెన్‌ల నుంచి వెలువ‌డే త‌రంగాలు వైఫై సిగ్న‌ల్స్ కు ఆటంకం క‌లిగిస్తాయి. అందువ‌ల్ల వాటికి రూట‌ర్లు దూరంగా ఉండేలా చూడాలి. దీంతో సిగ్న‌ల్ మెరుగ‌వుతుంది.

* బ్లూటూత్ ప‌రిక‌రాలు, ఎల్ఈడీ లైట్ల‌కు కూడా వైఫై రూట‌ర్‌ను దూరంగా ఉంచితే సిగ్న‌ల్ మెరుగ‌వుతుంది.

* సాధార‌ణంగా వైపై ని ఉప‌యోగించి ఫోన్లు లేదా పీసీల్లో పెద్ద ఫైల్స్ ను డౌన్ లోడ్ చేసిన‌ప్పుడు వైఫై సిగ్న‌ల్ కొంత వ‌ర‌కు త‌గ్గుతుంది. అయితే ఫైల్స్ డౌన్ లోడ్ పూర్తి కాగానే మ‌ళ్లీ సిగ్న‌ల్ పెరుగుతుంది. క‌నుక ఈ విష‌యంలో ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు.

* వైఫై రూట‌ర్‌కూ లిమిట్ ఉంటుంది. డివైస్‌లు దానికి ఎక్కువ‌గా క‌నెక్ట్ అయినా అందులోంచి వ‌చ్చే సిగ్న‌ల్ త‌గ్గుతుంది. క‌నుక ఈ విష‌యంపై కూడా దృష్టి పెట్టాలి. దీంతో వైఫై సిగ్న‌ల్‌ను పెంచుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

author avatar
Srikanth A

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju