ట్రెండింగ్ న్యూస్

Aadhaar UIDAI Services: ఆధార్ కార్డుతో లింకైన మొబైల్ నెంబర్ ను ఎలా తెలుసుకోవాలంటే..

Aadhaar UIDAI Services
Share

Aadhaar UIDAI Services: ఇటీవల కాలంలో కొంత మంది తరచు తమ సెల్ ఫోన్ నెంబర్‌లను మార్చుకోవడమో లేక రెండు మూడు సిమ్ కార్డులను వినియోగిస్తుండమో చేస్తున్నారు. అయితే దీంతో తమ అధార్ కార్డుకు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ వివరాలు తెలుసుకోవాలనుకునే వారు ఆ విషయాలను తెలియక ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసం ఈ విషయాలు క్లుప్తంగా…

Aadhaar UIDAI Services:
Aadhaar UIDAI Services:

మీ ఆధార్ కార్డుతో రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని సరిచూసుకోవాలంటే.. ఈ సింపుల్ ప్రొసీజర్ లో ముందు కు వెళ్లాలి. తొలుత మీ స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ నుండి UIDAI వెబ్ సైట్ లోకి వెళ్లి హోమ్ పేజ్ లో Verify Email/Mobile Number పేరుతో ఓ అప్షన్ కనిపిస్తుంది. ఆ ఆఫ్షన్ పై క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన పేజీ ఒకటి ఓపెన్ అవుతుంది.

ఈ పేజీలో మీ ఆధార్ నెంబర్ తో పాటు ఆధార్ నమోదు సమయంలో మీరు ఇచ్చిన ఈ మెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ వంటి వివరాలు ఆయా ఖాళీలలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత సెక్యూరిటీ కోడ్ ను కూడా ఎంటర్ చేసి క్రింద కనిపించే Get One Time Password పై క్లిక్ చేయాలి. మీరు సబ్మిట్ చెసిన వివరాలు సరైనవైతే మీ మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడీకి ఓటీపీ కోడ్ వస్తుంది. ఆ ఓటీపీ అదే పేజీలో కుడిచేతి వైపు కనిపించే Enter OTP  ఫీల్డ్ లో ఎంటర్ చేసినట్లైయితే Congratulations! The Mobile Number matches With our records! పేరుతో సిస్టం పై మేసేజ్ వస్తుంది. ఇలా వచ్చినట్లైయితే మీ ఆధార్ కార్డుతో రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్,  ఈ మెయిల్ ఐడీ మీ పేరు మీద ఉన్నట్లు నిర్ధారించుకోవచ్చు.

ఇదే విధంగా కేవలం మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడీ వివరాలను కూడా ఈ సైట్ లోకి వెళ్లి సరి చూసుకోవచ్చు.

 

 

 


Share

Related posts

Nellore Road Accident : నెల్లూరు లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..

bharani jella

అబ్బా మాస్‌రాజా పక్కన అప్సర రాణి .. ఆర్జీవీ అనుకున్నదే చేశాడు ..!

GRK

APCPDCL Notification : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీసీపీడీసీఎల్ నోటిఫికేషన్..!!

bharani jella