బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ కథ వేరే. తనకి ఇంట్లోకి వచ్చే ముందు ఒక స్క్రిప్ట్ ఇచ్చి దీని ప్రకారం నడుచుకోమన్నారో లేదా లోపలికి వచ్చాక కావాలనే లవ్వాట మొదలు పెట్టిందో అర్థం కాదు గాని ఓవైపు అభిజిత్ తో బాగా మాట్లాడుతూనే మరోవైపు అఖిల్ తన ప్రపంచం అన్నట్లు బిహేవ్ చేస్తోంది.
ముందు అభిజిత్-మోనాల్ కలిసేలా ఏర్పాట్లు జరిగాయి కానీ నుండి కథ అడ్డం తిరిగింది. అఖిల్-మోనాల్ నేటి వరకు కలిసి ఉన్నారు. అయితే అంతకు ముందు నుండి మోనాల్ అభిజిత్ తో బాగా మాట్లాడుతుంది. పైగా అభి అఖిల్ మంచి ఫ్రెండ్స్ గా కూడా ఉన్నారు. అయితే ఇద్దరూ కలిసి మోనాల్ గురించి మాట్లాడుకోవడం వారి మధ్య కొద్దిగా విభేదాలు వచ్చాయి. టమోటా పల్ప్ టాస్క్ తో మోనాల్ కు అభి పై కోపం వచ్చి ఉక్కు టాస్క్ లో అది కాస్తా పెరిగిపోయింది.
అందుకు తగ్గట్టు అభి కూడా హారిక తో క్లోజ్ గా ఉండడం మొదలు పెట్టాడు. దేవి, నోయల్ అభి గురించి చెప్పిన తర్వాత అతనితో మాట్లాడటం ప్రారంభించింది. ఆ సమయంలోనే రేషన్ రూమ్ దగ్గర కూర్చొని అభిజిత్ ఐ లైక్ యూ అని మోనాల్ చెప్పింది. అయితే వాళ్ళు ఇంకో టాస్క్ లో మళ్ళీ దూరం అయ్యారు. ఆ తర్వాత అఖిల్ తో మోనాల్ పూర్తిగా క్లోజ్ గా ఉంటుంది. అఖిల్ పడుకున్నాక అభితో మాట్లాడుతుంది. అభి తో మాట్లాడిన తర్వాత అఖిల్ తో క్లోజ్ గా ఉంటుందని దివి చేసిన కామెంట్లతో ఏడ్చింది.
తన క్యారెక్టర్ చెడుగా చూపిస్తున్నారు అని చెబుతూ ఈ ఇంట్లో తనకు అఖిల్ క్లోజ్ అని తనతోనే అన్నీ షేర్ చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది. మరి అఖిల్ పడుకున్నప్పుడు అభి తో మాట్లాడటం వెనుక కథ ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. అయితే ఏది కావాలని మోనాల్ చేయడం చేయడం లేదని.. ఆమెని ఎవరో ఒకరు మొదటి నుండి కంట్రోల్ చేస్తూనే ఉన్నారని అంటున్నారు. ఇంతకీ ఇందులో మీ ఉద్దేశం ఏమిటి?