తెలుగు టెలివిజన్ ప్రియులకు అత్యంత ప్రీతిపాత్రమైన బిగ్ బాస్ నాలుగవ సీజన్ లో అసలైన మజా మొదలైంది. బుల్లితెరపై అత్యంత భారీ స్థాయిలో ఆదరణ పొందుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న ఈ వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో తెలుగులో ఇప్పుడు భారీ స్పందన తెచ్చుకుంటోంది.
ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో మొదటి రోజు నుండే ప్రేమ కథలు పుట్టుకొచ్చాయి. ఇక వీటిని హైలెట్ చేస్తూ బిగ్ బాస్ నిర్వాహక బృందం కూడా తమదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వీటన్నిటి మధ్య బయటపడ్డ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్. ఈ సీజన్ లో లవ్ ట్రాక్ లను హైలెట్ చేయబోతున్నారు అనే విషయం ప్రారంభమైన రోజే అర్థం అయింది. ప్రీమియర్ ఎపిసోడ్ లో పోస్ట్ నాగార్జున కంటెస్టెంట్ అభిజిత్ కి హీరోయిన్ల ఫోటోలు చూపిస్తూ ఆడిన ఒక ఆట ఇందుకు బీజం పోసినట్లు అయ్యింది.
హౌస్ లోకి అడుగుపెట్టిన అభిజిత్ అందుకు తగ్గట్టుగానే మోనాల్ గజ్జర్ తో చనువుగా కూడా వ్యవహరిస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇటు మోనాల్ కూడా అతనికి బాగానే స్పందించింది. తరచూ ఇద్దరే మాట్లాడుకోవడం…. రొమాంటిక్ గా సైగలు చేసుకోవడం…. అన్నం తినిపించుకోవడం…. హగ్గులు ఇచ్చుకోవడం వంటివి బంధానికి బలం చేకూర్చాయి. అయితే ఇదే సమయంలో మరో కంటెస్టెంట్ అఖిల్ తో మోనాల్ చనువుగా ఉండడం గమనార్హం.
దీంతో ఆమె దూరం అభిజిత్ కు అయినట్లు అందరికీ అనిపిస్తుంది. కానీ వీరిద్దరి ప్రేమ కథ మధ్యలో అఖిల్ పాత్ర ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. మొత్తానికి మోనాల్ మాత్రం ఇద్దరితో బాగానే ఉంటుంది. అయితే ఈ రోజు విడుదల చేసిన ప్రోమోలో అన్నం తింటూ పొరబోయిన మోనాల్ కు అఖిల, అభిజిత్ ఇద్దరూ ఆమెకు నీరు అందించేందుకు పోటీపడ్డారు. ఇలాంటివి చాలా ఉన్నాయి లోపల దాచుంచాం అన్నట్లు నిర్వాహకులు కూడా సగం వీడియోలే విడుదల చేస్తున్నారు.
మొత్తానికి వీరి ముగ్గురిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే వరకు ఈ ప్రేమాయణం కొనసాగుతూనే ఉంటుంది.. లేదా తన మనసులో మాటా బయటకు చెప్పే వరకు వెయిట్ చేయాలి. అటు ప్రేక్షకులకు కావలసినంత డ్రామా, మజా…. ఇటు ఛానల్ కు బోలెడంత టిఆర్పి.