ప్రముఖ టాలీవుడ్ సినీ నటుడు జగపతిబాబు సోదరుడు యోగేంద్ర కుమార్ కు బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయి. శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి నుండి దాదాపు 25 సార్లు ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
జగపతిబాబు సోదరుడు యుగేంధ్ర కుమార్ తో పాటు అతడి కుమారుడుని కూడా చంపేస్తామంటూ ఇటీవల శ్రీనివాస్ అనే వ్యక్తి పదే పదే ఫోన్ చేసినట్లు.. చేసిన ప్రతి సారి చాలా ఘోరమైన రీతిలో బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఈ విషయాన్ని బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. ఇంకా ఈ విషయంపై జగపతి బాబు మీడియా వర్గాల తో మాట్లాడ లేదు కానీ ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరు అసలు జగపతిబాబు కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించాల్సిన అవసరం అతనికి ఏమొచ్చింది అన్నది ఇంకా తేలాల్సి ఉంది.