చదువు పూర్తి కాగానే అసలైన వృత్తి నైపుణ్యం సాధించాలంటే అప్రెంటిస్ షిప్ చేయాలి.. వరుసగా అప్రెంటిస్ షిప్ నోటిఫికెషన్స్ విడుదల అవుతున్నాయి.. ఈ నేపథ్యంలో అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) అప్రెంటిస్ ట్రయినీ నోటిఫికెషన్స్ విడుదల చేసింది.. దీని ద్వారా గ్రాడ్యుయేట్, టెక్నికల్ (డిప్లమో) పోస్టుల భర్తీ చేస్తుంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
మొత్తం ఖాళీలు : 180
విభాగాల వారీగా అప్రెంటిస్ ఖాళీలు :
గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్ : 160
విభాగాలు : ఈసీఈ , సిఎస్ఈ, మెకానికల్, ఈఈఈ, సివిల్
అర్హతలు : ఈ పోస్టులకు 1 ఏప్రిల్ 2018 నాటికి ఎవరైతే సంబంధిత బ్రాంచ్ లలో బిఈ , బిటెక్ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.
వయసు : 31 /1 /2021 నాటికి 25 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు , ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ట వయసులో సడలింపు వర్తిస్తుంది.
ఉపకార వేతనం : నెలకు రూ. 9000 చెల్లిస్తారు.
శిక్షణ కాలం : ఒక సంవత్సరం
టెక్నీషియన్ డిప్లమా అప్రెంటిస్ : 20
అర్హతలు : ఈ పోస్టులకు 1 ఏప్రిల్ 2018 నాటికి ఎవరైతే సంబంధిత బ్రాంచ్ లలో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.
వయసు : 31 /1 /2021 నాటికి 25 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు , ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ట వయసులో సడలింపు వర్తిస్తుంది.
ఉపకార వేతనం : నెలకు రూ. 8000 చెల్లిస్తారు.
శిక్షణ కాలం : ఒక సంవత్సరం
ఎంపిక విధానం :
సంబంధిత అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ అయితే బిఈ , బిటెక్ లో సాధించిన మార్కుల ఆధారంగా , డిప్లమో అప్రెంటిస్ అయితే డిప్లమో ఇంజనీరింగ్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 15/1/2021
అప్రెంటిస్ శిక్షణ తేదీ : 4/2/2021