ఇండస్ట్రీలో సింగర్ గా మాత్రమే కాకుండా చాలా మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెబుతూ మంచి క్రేజ్ సంపాదించింది సునీత. గత పాతిక సంవత్సరాల నుండి తన అద్భుతమైన గొంతుతో పాటలు పాడుతూ చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగు సినిమా రంగంలో ఏ గాయనికి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ సునీత కి సొంతం.
ఇదిలా ఉండగా అప్పట్లో రెండో వివాహం అంటూ ఆమెపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తల తీవ్రస్థాయిలో సీరియస్ గా.. వచ్చిన వార్తలపై స్పందించిన సునీత, తాజాగా రెండో వివాహానికి రెడీ అవటమే కాకుండా నిశ్చితార్థం కూడా చేసుకోవటం ఇప్పుడు సంచలనంగా మారింది. డిజిటల్ మార్కెట్ రంగంలో బడా పారిశ్రామిక వేత్తగా రాణిస్తున్న రామ్ వీరపనేని అనే వ్యక్తితో సింగర్ సునీత వివాహానికి రెడీ అయ్యింది. ఈ మేరకు తన ఇంటిలో అతి తక్కువ మంది కుటుంబ సభ్యులతో సభ్యుల మధ్య నిశ్చితార్థ కార్యక్రమం కానిచ్చేశారు.
ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాస్తవానికి సింగర్ సునీత కి 19 సంవత్సరాల వయసులోనే వివాహం కావడం మాత్రమే కాక ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్త తో విసిగి పోవటంతో..నుండి విడాకులు తీసుకున్న సునీత పిల్లల సంరక్షణ చూసుకుంటూ కెరియర్ సాగిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆమె రెండో వివాహానికి రెడీ అవ్వడం ఇండస్ట్రీ వర్గాల లో ఇది సంచలనంగా మారింది. అంతమాత్రమే కాకుండా సునీత ని వివాహం చేసుకుంటున్న రామ్ వీరపనేని కి కూడా ఇది రెండో వివాహమే.