32.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Happy Republic Day 2023: వాట్సాప్ మరియు సోషల్ మీడియాలో షేర్ చేయడానికి బెస్ట్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఇవి

Share

Happy Republic Day 2023: దేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1950 జనవరి 26న భారత ప్రభుత్వ చట్టానికి (1935) బదులు భారత రాజ్యాంగం దేశ పరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు. భారత రాజ్యాంగ సభలో 1949 నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం పొందినప్పటికీ కొద్ది నెలల తర్వాత 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. జనవరి 26 నే ఇందుకు ఎంచుకోవడానికి చారిత్రికమైన కారణం కూడా ఉంది. 1930లో భారత జాతీయ కాంగ్రెస్‌ పూర్ణ స్వరాజ్‌ని ఆ రోజే ప్రకటించుకుంది. అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలును జనవరి 26న చేయాలని నిర్ణయించారు. గణతంత్ర దినోత్సవం జనవరి 26 జాతీయ సెలవుదినంగా కూడా ప్రకటించారు.

Happy Republic Day 2023

ప్రతి ఏటా రిపబ్లిక్ డే వేడుకలు అద్భుతమైన సైనిక, సాంస్కృతిక ప్రదర్శనతో నిర్వహిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య ఫథ్ ప్రధాన వేదికగా గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుగుతాయి. సాయుధ సిబ్బంది మాతృభూమికి, తోటి పౌరుల ఐక్యత, సమగ్రతకు నివాళులర్పిస్తూ కవాతు చేస్తారు. ఈ ఏడాది 74వ గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి తుపాకీ పేలుళ్లతో సైనికుల వందనం స్వీకరిస్తారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకునేందుకు ప్రధానమైన సందేశాలు ఇలా..

Republic Day 2023

మూడు రంగుల జెండా ..
ముచ్చటైన జెండా..
భారతదేశ జెండా.. అందరికీ అండ
నింగిలో ఎగిరి జెండా . అందరూ మెచ్చే జెండా..
మనందరిలో ఆశలు రేపిన జెండా..
మీకు మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు

స్వాతంత్య్ర సమరయోధుల పోరాటం..
అమరవీరుల త్యాగఫలం.. ఆంగ్లేయులపై తిరుగులేని విజయం.. మన
గణతంత్ర దినోత్సవం అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే.

భారతమాత కోసం తమ ధన, మన, ప్రాణాలను త్యాగం చేసిన వారెందరో మహానుభావులు..
అందరికీ ఇవే మా వందనాలు.. మీకు మీ కుటుంబ సభ్యులకు మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..

నేను భారతీయుడిని అయినందుకు గర్విస్తున్నా..
ఎల్లప్పుడూ నేను భారతమాతకు రుణపడి ఉంటా.. బిన్నత్వంలో ఏకత్వాన్ని అందించిన భారతమాతకు జేజేలు, మీకు మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు…

ప్రతి గురువు ఈ దేశాన్ని ఎలా ప్రేమించాలో విద్యార్ధులకు నేర్పించాలి.. తల్లిదండ్రులు కూడా పిల్లలకు దేశం గురించి చెప్పాలి.. మీకు మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..

మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు.. మనకు సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చిన ఈ రోజే గణతంత్ర దినోత్సవం.. మీకు మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు…

మన స్వేచ్చ, స్వాతంత్య్రం కోసం అశువులు బాసిన సమరయోధుల దీక్ష, దక్షతలను స్మరిస్తూ.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ఏ దేశమేగినా .. ఎందుకాలిడినా.. ఏ పీఠ పెక్కినా.. ఎవ్వరెదురైనా.. పొగడరా.. నీ తల్లి భూమి భారతిని.. నిలువరా నీ జాతి నిండు గౌరవము..అందరికీ .. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

మాతృభూమి కోసం తమ ధన, మాన ప్రాణాలను త్యాగం చేసిన వారెందరో మహానుభావులు, అందరికీ వందనాలు..గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

జాతులు వేరైనా, భాషలు వేరైనా.. మనమంతా ఒక్కటే.. కులాలు వేరైనా, మతాలు వేరైనా.. మనమంతా భారతీయులం.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

మూడు రంగుల జెండా..
ముచ్చటైన జెండా
భారతీయుల జెండా.. బహుగొప్పదైన జెండా
అందరూ మెచ్చిన జెండా..
అకాశంలో ఎగిరే జెండా
అంధకారం పొగొట్టిన జెండా..
ఆశలు మనలో రేపిన జెండా.. – అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

నేను భారతీయుడినైనందుకు గర్విస్తున్నాను.. సదా నేను భారతమతకు రుణపడి ఉంటాను..భిన్నత్వంలో ఏకత్వాన్ని అందించిన భారత మాతకు జేజేలు.. – గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

మన దేశాన్ని అత్యుత్తమంగా మారుద్దాం. శాంతికి, దయకు మారుపేరుగా నిలుపుదాం – గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు


Share

Related posts

ఏపి బీజేపీ నేత కన్నా కోడలు అనుమానాస్పద మృతి

somaraju sharma

Rahul raveendran : రాహుల్ రవీంద్రన్ రెండు పడవల ప్రయాణం..!

GRK

హస్తినలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసిఆర్..హజరైన ఇతర పార్టీ నేతలు ఎవరంటే..?

somaraju sharma