NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వివేకా హత్యపై తొలిసారిగా మీడియా ముందు స్పందించి కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇవేళ విచారణకు హజరు కాలేననీ, తమకు సమయం కావాలని ఆయన సీబీఐకి లేఖ రాశారు. సీబీఐ లేఖపై అవినాష్ రెడ్డి స్పందిస్తూ.. నిన్న నోటీసులు ఇచ్చి ఈ రోజు విచారణకు హజరుకావాలని పేర్కొన్నారన్నారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల ఇవేళ విచారణకు హజరు కావడం లేదని చెప్పారు. కనీసం రోజుకు రెండు మూడు వందల మందికి ఉచితంగా భోజనం పంపిణీ చేసే కార్యక్రమం ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నానని చెప్పారు. అందుకే నాలుగైదు రోజులు విచారణకు గడువు కోరాననీ, ఆ తర్వాత ఎప్పుడు విచారణకు నోటీసులు ఇచ్చినా వారి ముందు హజరై వారు అడిగిన ప్రశ్నలకు, సందేహాలకు సమాధానం ఇస్తానని తెలిపారు.

YS Avinash Reddy

 

గత రెండున్నర సంవత్సరాలుగా తనపై, తన కుటుంబంపైనా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అసత్యపు ఆరోపణలు చేస్తూ క్యారెక్టర్ అసాసినేషన్ కు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు అవినాష్ రెడ్డి. కోర్టులో ట్రయిల్ మాత్రం ప్రారంభం కాలేదు కానీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం తనపైన, తన దగ్గరి వారిపైనా అసత్య ఆరోపణలు చేస్తూ వచ్చాయన్నారు. ఏనాడూ తాను మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదన్నారు. ఈ సబ్జెక్ట్ పై మాట్లాడటానికి తన మనసు అంగీకరించడం లేదనీ, ఆ అభియోగాలు జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. తానేమిటో, తన వ్యక్తిత్వం ఏమిటో, తన వ్యవహారా శైలి ఏమిటో ఈ జిల్లా ప్రజలందరికీ బాగా తెలుసునని అన్నారు.

MP Avinash Reddy

 

ప్రతి ఒక్కరినీ తాను మనవి చేసేది ఏమిటంటే న్యాయం గెలవాలి. నిజం వెల్లడి కావాలని దేవుడిని కోరుకోవాలని, తాను అదే కోరుకుంటున్నానన్నారు. మీడియా కూడా నిజం గెలవాలని కోరుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతే తప్ప కంక్లూజన్స్ డ్రా చేయవద్దని హితవు పలికారు. ఇటువంటి అభియోగాలు మోపి కారెక్టర్ అసాసినేషన్ చేస్తే దగ్గరి వాళ్లు ఎంత బాధపడతారో అర్ధం చేసుకోవాలన్నారు. మీకుటుంబాల్లో ఏమైనా జరిగితే మీకు ఆ బాధ తెలుస్తుందని మీడియాను ఉద్దేశించి అన్నారు. మీడియా బాధ్యతగా వ్యవహరించాలని నిజం గెలవడానికి కృషి చేయాలని కోరారు అవినాష్ రెడ్డి.

YS Viveka Murder Case: సీబీఐ విచారణకు సహకరిస్తా .. కానీ

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

PM Modi: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోడీ కౌంటర్ ఇలా .. ‘శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది’  

sharma somaraju