NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Face: ముఖానికి ఇవి రాస్తే ఇక అంతే..

Face: అందంగా కనిపించటం కోసం మనకి నచ్చినవి రాస్తుంటం.. అయితే అవి ముఖానికి రాయవచ్చా లేదా అనే విషయం మనకి తెలియదు.. ఇలా చేయడం వలన ఉన్న సమస్య కాస్త పెద్దదిగా మారే అవకాశం లేకపోలేదు.. ముఖ్యంగా మన వంటింట్లో లభించే వస్తువులతో కొన్ని పదార్థాలు కలిపి ముఖానికి రాయటం.. లేదంటే వాటిని నేరుగా పూయటం మంచిది కాదని డెర్మటాలజిస్ట్ చెబుతున్నారు.. మొహానికి ఏ ఏ పదార్థాలు రాయకూడదో ఇప్పుడు చూద్దాం..!!

If Apply These Things on your Face See What happens
If Apply These Things on your Face See What happens

Face: ముఖానికి ఇవి రాస్తున్నారా..!? చూడండి ఏం జరుగుతుందో..!!

నిమ్మ కాయ:
నిమ్మ కాయ లో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అయితే దీనిని నేరుగా ముఖానికి రాయకూడదు. నిమ్మ లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది డైరెక్ట్ గా ఫేస్ పై అప్లై చేయడం వలన చర్మానికి హాని చేస్తుంది. ఇలా ఎక్కువ రోజులు నేరుగా నిమ్మ కాయ రసం రాయటం వలన ముఖం నల్లగా మారుతుంది. అందుకని నిమ్మను సెనగ పిండి, టమోటో, రోజ్ వాటర్, పాలు, తేనె, ఫేస్ ప్యాక్ లో కలిపి రాసుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంతే కానీ నేరుగా మాత్రం రాయకూడదు. అలాగే నిమ్మ ను ముఖానికి అవసరం అయితే ఉపయోగించటం మంచిది. లేకపోతే చర్మం పై దురద, దద్దుర్లు, బొబ్బలు వస్తాయి. మీ చర్మాన్ని పొడిగా చేస్తుంది. డ్రై స్కిన్ వారు నిమ్మ రసం అసలు ఉపయోగించకూడదు. ఇది చర్మ మృదుత్వాన్ని తొలగిస్తుంది. ఇంకా ముఖం ముడతలు పడతాయి. ఇక నుంచైనా నిమ్మ ను ఉపయోగించకుండా ఉండండి.

If Apply These Things on your Face See What happens
If Apply These Things on your Face See What happens

పసుపు:
పసుపు మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో యాంటీ సెప్టిక్, ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అయితే పసుపు అందరి చర్మ తత్వానికి సరిపడదు. పసుపు నేరుగా ముఖానికి రాసి ఎక్కువ సేపు ఉంచకూడదు. 20 నిమిషాలకు మించి పసుపు తో కలిపి వేసుకున్న ప్యాక్స్ ఉండకూడదు. కొంతమంది ఎక్కువ మెరుపు రావాలన్న ఉద్దేశంతో నిర్ణీత సమయం కంటే మరో అరగంట సేపు అలాగే ఉంచుతారు. దీని వలన ముఖం పై పసుపు రంగు మచ్చలు తో పాటు మొటిమలు వచ్చే అవకాశం ఉంది. అలాగే పసుపు ప్యాక్ వేసుకున్న తర్వాత ఎక్కువ మంది చేసే పొరపాటు వెంటనే సబ్బుతో మొహం కడుక్కోవటం. పసుపు రాసుకున్న 10 గంటలు వరకు ముఖానికి సబ్బు పెట్టకూడదు.

If Apply These Things on your Face See What happens
If Apply These Things on your Face See What happens

ఆపిల్ సైడర్ వెనిగర్:
ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఎసిటిక్ ఆమ్లం ఉంటుంది. దీన్ని నేరుగా తాగకూడదు. అదేవిధంగా డైరెక్ట్ గా ముఖానికి అప్లై చేయకూడదు. దీనిని కూడా ఏదైనా పదార్థాల తో కలిపి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఆ ప్యాక్ కూడా ఎక్కువ సేపు ఉంచకూడదు. దీనిలో ఉండే ఎసిటిక్ ఆమ్లం కారణంగా ముఖం పై వాపు, అలర్జీ వస్తుంది. అందువలన దీని ఉపయోగించక పోవటమే ఉత్తమం.

If Apply These Things on your Face See What happens
If Apply These Things on your Face See What happens

దాల్చిన చెక్క:
సుగంధ ద్రవ్యాల లో దాల్చిన చెక్క కూడా ఒకటి. మనం అనేక పత్రికలు, ఛానెల్స్ లో దాల్చిన చెక్క ముఖానికి రాసుకుంటే మంచిదని వింటుంటాం.. అయితే దాల్చిన చెక్క పొడిని దేనితోనూ కలపకుండా నేరుగా పూతగా రాయటం మంచిది కాదు. దీని వలన చర్మం పై రాషేస్ వస్తాయి. సిన్నమోన్ ఎలర్జి ఉన్నవారు దాల్చిన చెక్క పొడి రాసుకోకుడదు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N