NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

World Record’s: కడుపు-పేగులు లేకుండా.. వింత మనిషి వరల్డ్ రికార్డులు..!!

World Record’s: ప్రపంచంలో వింత వింత సంఘటనలు చోటు చేసుకోవడం తెలిసిందే. వింత వింత ఆకారాలతో జంతువులు.. అదే రీతిలో మనుషులు పూడుతూ ఉంటారు. వాళ్లకు సంబంధించిన ఫోటోలు .. సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యి ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతూ ఉంటాయి. రెండు తలకాయల దూడ.. నాలుగు కాళ్ళ కోడి పిల్లలు… ఒకే వ్యక్తికి రెండు గుండెలు.. ఇంకా మరో వ్యక్తికి కుడి పక్కన గుండె ఉండటం.. మాత్రమే కాక ఇంకా చాలా రకాల మనుషులు గురించి వాళ్ళ అవయవ నిర్మాణం గురించి.. వింతైన వార్తలు వింటూ ఉంటాం. ఇప్పుడు ఇదే కోవలో.. ఒక వ్యక్తికి ఏకంగా కడుపు మాత్రమే కాక పేగులు లేకుండా బతికేస్తున్నాడు. అది ఎలా సాధ్యం అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఇక పూర్తి విషయంలోకి వెళితే స్పెయిన్ దేశానికి చెందిన జువాన్ డ్యూయల్ అనే 36 ఏళ్ల వ్యక్తి ఏకంగా కడుపు, పేగులు, పిత్తాశయం లేకుండా జీవిస్తున్నాడు. అవయవాలు కోల్పోయినా అతడు ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. అవేవీ లేకుండానే అతడు ఇప్పుడు గొప్ప మారథన్‌ రన్నర్‌గా పేరు సాధించడం మాత్రమే కాక అనేక రికార్డులు సృష్టిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. జువాన్ డ్యూయల్ కి 13 సంవత్సరాల వయసు కలిగిన నాటినుండి “ఫ్యామిలీయల్ మల్టిపుల్ పాలిపోసిస్” అనే వింత వ్యాధితో వంశపారంపర్యంగా వస్తున్న వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు.

Healthy Life Of The Brave Spanish Man Living Without Stomach, Colon, &  Rectum | Rudebees NG

ఈ వ్యాధి వల్ల జీర్ణ వ్యవస్థ మొత్తం పాడైపోయి క్యాన్సర్ కి గురయ్యే అవకాశం ఉందని అప్ప టికే వైద్యులు హెచ్చరించారు. ఇదే వ్యాధితో అమ్మమ్మ తో పాటు అతని తండ్రి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొనడం మాత్రమే కాక పేగులకు సర్జరీ చేయించుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఇతగాడికి సరిగ్గా 19 సంవత్సరాల వయసు రాగానే… ఈ వ్యాధి మరింతగా ముదిరి అతడి ప్రేగులు, పెద్ద ప్రేగు… పురీషనాళం మొత్తాన్ని తొలగించడం జరిగింది. అయినా గాని జువాన్ ఆరోగ్య విషయంలో ఎటువంటి మార్పులు రాలేదు. ఇటువంటి క్రమంలో 28 సంవత్సరాల వయసు రాగానే మరింత పరిస్థితి ప్రమాదకరంగా మారటంతో… అతగాడి కడుపుకి సోకడంతో… వైద్యులు వెంటనే అతని కడుపును తొలగించేశారు. ఈ పరిణామంతో 105 కేజీలు ఉండే జువాన్… 57 కిలోలకు తగ్గి పోయాడు. అయినా కానీ ఆ బ్యాక్టీరియా పిత్తాశయాన్ని కూడా పాడు చేసుకుంటూ ఉండటం తో దాన్ని కూడా వైద్యులు తొలగించారు. ఈ సర్జరీతో జువాన్ కి కడుపు, పేగులు, పితాషియం మొత్తం కోల్పోవడం జరిగింది. జువాన్ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారటంతో ప్రాణాలతో అతని దక్కించుకోవటానికి… అతని కుటుంబం అనేక హాస్పిటల్ చుట్టూ తిరగడంతో… పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు.

Juan Dual - Jornadas IATI de los grandes viajes #iatiJGV

అదే సమయంలో స్పెయిన్ దేశంలో ఆర్థిక మాంద్యం తలెత్తడంతో జీవించడానికే బతుకు కష్టం కావడంతో.. పాటు శరీరంలో ఉన్న అవయవాలు బతకడానికి సహకరించ లేని పరిస్థితి ఏర్పడటంతో అతని స్నేహితులు… జపాన్ దేశానికి తరలించారు. అక్కడ కొద్దోగొప్పో అతని ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు.. ప్రశాంతంగా జీవిస్తూ అక్కడి భాష రాకపోవడంతో జువాన్ ఎప్పుడూ కూడా తన వెంట ఒక కుక్కను ఉండేలా అక్కడ వీధులలో తిరిగేలా వెంట పెట్టి నడిపించుకునే వాడు. అయితే ఒక్కసారి వీధులలో కుక్క తో పాటు నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా చేయి చేతిలోనుండి వదిలించుకుని పారిపోవడంతో దాన్ని పట్టుకోవడానికి అనుకోకుండా జువాన్ పరిగెట్టడం తో తనలో ఒక ఆత్మ స్థైర్యం నెలకొంది.

Juan Dual el atleta sin estómago y sin colon al que nunca le da hambre -  Mediotiempo

తాను పరిగెత్తగలరా అన్న నమ్మకం ఏర్పడి జువాన్… కడుపుకి తిండి లేకపోయినా గాని… బాడీలో ఎనర్జీ ఉండేలా.. ప్రముఖ వైద్యుల సలహాల మేరకు డైట్ పాటిస్తూ… నిత్యం బాడీని ఫిట్ గా ఉంచుకోవడం మాత్రమే కాక డైలీ రన్నింగ్ తో పాటు… వ్యాయామం చేసేవాడు. న్యూట్రీషియన్స్ సలహాల మేరకు డైట్ పాటిస్తూ. తన పరుగును కొనసాగిస్తూ బార్సిలోనాలో జరిగిన ఆఫ్ మారథాన్ రన్నింగ్ రేస్ లో రికార్డు స్థాయిలో రెండు గంటల్లోనే … పరుగు పందాలు పూర్తిచేసి.. ఆ తర్వాత పర్వతాలు ఎక్కటం ప్రారంభించాడు. కడుపులో లేకపోయినా పేగులు లేకపోయినా ఆహారం పెద్దగా తీసుకోకపోయినా గాని జువాన్ తన ఆత్మస్థైర్యంతో పర్వతాలు ఎక్కటం లో రన్నింగ్ రేస్ లో అతగాడు సృష్టిస్తున్న రికార్డులు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. అంతర్గత అవయవాలు లేకపోయినా గాని ఆత్మస్థైర్యం ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అనే స్ఫూర్తిని ఇవ్వడం జరిగింది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N