ట్రెండింగ్ న్యూస్

Cristiano Ronaldo: ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో ఇంట విషాదం..!!

Share

Cristiano Ronaldo: అంతర్జాతీయ ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో అందరికి సుపరిచితుడే. ప్రపంచ క్రీడారంగంలో అత్యధిక అభిమానులు అదే విధంగా కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ భారీ ఎత్తున రెమ్యూన్ రేషన్ అందుకుంటున్న ఆటగాడిగా.. మనోడికి తిరుగులేని ట్రాక్ రికార్డు ఉంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా క్రిస్టియానో రోనాల్డోకి అభిమానులు ఉంటారు. మన ఇండియాలో గోవాలో కూడా క్రిస్టియానో రోనాల్డోకి అభిమానులు ఉన్నారు. మొన్ననే  ఏకంగా విగ్రహం కూడా ఏర్పాటు చేయటానికి రెడీ అయ్యారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఇంతటి.. క్రేజ్ కలిగిన ఆటగాడిగా ఉన్న క్రిస్టియానో రోనాల్డో ఇంటిలో విషాదం చోటుచేసుకుంది. Cristiano Ronaldo twin baby dies: Manchester United striker's baby passes away | Herald Sun

క్రిస్టియానో రోనాల్డో కొడుకు మరణించడం జరిగింది. ఈ విషయాన్ని రోనాల్డో సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. జార్జినా- రోనాల్డో జంటకి అప్పుడే పుట్టిన కవలలలో ఒకరు మరణించారు. క్రిస్టియానో రోనాల్డో.. సోషల్ మీడియాలో తెలియజేస్తూ…” అప్పుడే పుట్టిన మా బాబు.. చనిపోయిన విషయం మీతో పంచుకున్నందుకు చాలా బాధగా ఉంది. ఏ తల్లి తండ్రుల కన్నా ఇది భరించలేని విషయం. పుట్టిన కవలలో పాప బతికి ఉన్న ఒక్క విషయం మాకు కొంత ఆశ… ఆనందాన్ని ఇచ్చే విషయం. ఇటువంటి క్లిష్ట సమయంలో మా వెన్నంటే ఉన్న వైద్యులు… నర్సులకు ధన్యవాదాలు. Cristiano Ronaldo announces the death of baby son

ఇక ఇదే సమయంలో మా వ్యక్తిగత గోప్యతకి  ఎటువంటి భంగం కలిగించవద్దని కోరుతున్నాను..అంటూ ఉద్వేగభరితమైన పోస్ట్ క్రిస్టియానో రోనాల్డో పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. జార్జినా – క్రిస్టియానో రోనాల్డోకి ప్రస్తుతం నలుగురు పిల్లలు ఉన్నారు. గత ఏడాది అక్టోబరు మాసంలో మాకు కవలలు పుట్ట బోయే అవకాశం ఉందని ప్రకటించారు. పైగా కుటుంబమే తనకి పెద్ద బలమని పలు సందర్భాలలో  రోనాల్డో తెలియజేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో పుట్టిన కవలలో ఒకరు మరణించటం.. తీవ్ర విషాదంగా నెలకొంది.


Share

Related posts

ఆ చెరువే నాదని బోర్డ్ పెట్టేసిన వైసిపి ఎమ్మెల్యే!పటాన్‌చెరు భూకబ్జా వ్యవహారంలో కొత్త మలుపు!!

Yandamuri

మాట.. ఎన్నికల తూటా : కులం… రాజకీయ వ్యూహం.. !! పవన్ వ్యాఖ్యల వెనుక చాలా ఉంది

Comrade CHE

Clove Tea: లవంగం టీ తాగితే ఏం జరుగుతుందో తెలుసా..!?

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar