మొదటి బాక్సింగ్ డే టెస్ట్ లో ఘోర పరాభవం నుంచి భారత జట్టు పాఠాలు నేర్చుకున్నట్టే కనిపిస్తోంది.. రెండో టెస్ట్ లు ఏ మాత్రం అంచనాలు లేకుండా దిగువస్థాయి ఆటగాళ్లతో మైదానం లోకి దిగిన భారత క్రికెట్ జట్టు అద్భుతం చేసేలా కనిపిస్తోంది.. అద్భుతమైన బాటింగ్ తో మొదటి ఇన్నింగ్స్ లో 131 రన్స్ ఆధిక్యత సాధించిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్ కు ఆసీస్ ను ఆహ్వానించింది… రెండో ఇన్నింగ్స్ లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ టాప్ ఆర్డర్ నడ్డి విరిచింది భారత బౌలింగ్ త్రయం..
** లంచ్ సమయానికి ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ అంత కుప్పకూలింది. 133 రన్స్ సాధించి 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్… కేవలం రెండు రన్స్ ఆధిక్యాన్ని మాత్రమే సంపాదించింది. క్రీమ్, కమ్మిన్స్ క్రీజులో ఉన్నారు. క్రీమ్ 17 పరుగులు, కమ్మిన్స్ 15 పరుగులు సాధించారు. 3 వ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లోనే ఉంది. మిగిలిన 4 వికెట్స్ 4 వ రోజు వెంటనే తీయగలిగితే ఆస్ట్రేలియా లీడ్ పెద్దగా పెరగకుండా నిలువరించగలిగితే భారత్ ఒక అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నట్లే…
అంత వీజీ కాదు !!
ఆస్ట్రేలియా చివరి వరకు పోరాడే స్వభావాన్ని చూపుతుంది. దీన్ని గుర్తు పెట్టుకుని మన బౌలర్లు చివరి 4 వికెట్స్ పడగొట్టడం మీద ద్రుష్టి పెట్టాలి. అలాగే స్కోర్ భారీగా పెంచేకుండా చూసుకోవడం ప్రధానం… ఆస్ట్రేలియా లీడ్ లోకి వచ్చాక మల్లి ప్రత్యర్థికి అవకాశం ఇవ్వదు అనే పేరుంది.. ఇప్పుడు 1 – 0 లీడ్ లో ఉన్న ఆసీస్ ను సొంత గడ్డ మీద నిలువరిస్తే అది పెద్ద విషయమే.
** రెండో టెస్ట్ లో పెద్ద ఆటగాళ్లు ఎవరు లేరు. కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా రహానే కెప్టెన్ బాధ్యతలు తీసుకున్నాడు. ఇక షమీ స్థానంలో సిరాజ్ వచ్చాడు. బాటింగ్ విషయంలోనూ అంత అంచనాలు ఏమి లేకుండానే బరిలోకి దిగిన జట్టు.. ఆసీస్ ను నిలువరించగలిగితే గొప్ప విషయమే…