Big Boss : బిగ్ బాస్ సీజన్ త్రీ రియాల్టీ షో కలిసి దాదాపు నాలుగు నెలలు కావస్తున్నా సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో పాల్గొన్న చాలా మంది కంటెస్టెంట్ లలో ప్రస్తుతం బయట టాప్ సెలబ్రిటీలు గా టెలివిజన్ రంగంలో సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నరు. కాగా వీరిలో ఎక్కువగా లేడీస్ కంటెస్టెంట్ లలో దేత్తడి హారిక మంచి క్రేజ్ సంపాదించుకోవటం జరిగింది. హౌస్ లో ఫిజికల్ టాస్క్ లో అబ్బాయిలకు మంచి పోటీ ఇస్తూ ఏ మాత్రం తీసిపోకుండా కెప్టెన్ గా ఏడు సార్లు కృషి చేసి చివరాకరికి కెప్టెన్ అయ్యి తనలో సత్తా చాటడం జరిగింది.
బిగ్ బాస్ హౌస్ లో రాకముందు యూట్యూబ్ లో ‘దేత్తడి’ అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి పాపులారిటీ ఉన్న హారిక తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయి కావటంతో పాటు తెలంగాణ యాస లో అదిరిపోయే రీతిలో మాట్లాడుతూ తక్కువ టైంలోనే మంచి గుర్తింపు పొందింది. బిగ్ బాస్ హౌస్ లో కూడా తెలంగాణ యాసలో భారీ డైలాగులు కీలక సమయాలలో హారిక వేయటం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పలు సినిమా ఆఫర్లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే ఆఫర్ అందించింది. మేటర్ లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా హారిక ఎంపికయింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడి చేస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.