NewsOrbit
న్యూస్

కరోనాతో కార్పొరేట్ ఆసుపత్రికి వెళితే…!

హైదరాబాద్ : ప్రజల్లో కరోనాపై ఉన్న భయం ప్రైవేట్ ఆసుపత్రులకు వరంగా మారుతోంది. కరోనా పేషెంట్స్ కు కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వాహకులు ఇస్తున్న బిల్లులు చూస్తేనే సామాన్య, మధ్య తరగతి వర్గాలకు గుండె పోటు వచ్చే పరిస్థితి ఉందని అంటున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ఒ కరోనా పేషెంట్ కు ట్రీట్మెంట్ చేసినందుకు అక్షరాలా మూడు లక్షల 40 వేల రూపాయలు ఛార్జ్ చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణా ప్రభుత్వం కరోనా చికిత్సకు ప్రయివేట్ ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఫీజుల వసూలుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ ప్రయివేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు వారి ఇస్తాను రీతిలో ఫీజు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. పీపీఈ కిట్లు, ఎమర్జెన్సీ వైద్యం పేరిట భారీగా వసూళ్లు చేస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. కరోనా పేషెంట్స్ పట్ల పలు కార్పొరేట్ ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదం అవుతున్నాయి. ఒ పేషెంట్ విషయంలో మంత్రలు కేటీఆర్, ఈటెల రాజేంద్రలు జోక్యం చేసుకొని షటిల్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది.

మనోజ్ కొఠారి (47) అనే వ్యక్తితో పాటు అతడి తల్లి, సోదరుడు కరోనాతో ఇటీవల హైదరాబాద్ నగరంలోని ఒక ప్రైవేట్ లో చేరారు. జూన్ 28 నాటికి ఆయన కోవిడ్ నుంచి కోలుకున్నారు. మనోజ్ కుటుంబానికి ఇన్సూరెన్స్ ఉండటంతో ఆసుపత్రి వర్గాలు ముందుగా డబ్బులు కట్టించుకోలేదు. అయితే డిశ్చార్జ్ సమయంలో మనోజ్‌ 4.2 లక్షల రూపాయలు చెల్లించాలంటూ ఆసుపత్రి యాజమాన్యం బిల్లు ఇచ్చింది. ఇన్సూరెన్స్ కంపెనీ కేవలం లక్షా 23 వేల రూపాయలకు మాత్రమే క్లెయిమ్‌‌ అప్రూవల్ ఇచ్చినందున మిగిలిన సొమ్ము చెల్లించాల్సిందేననీ ఆసుపత్రి వర్గాలు పట్టుపట్టాయి. అయితే మంత్రి కేటీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ జోక్యం చేసుకోవడంతో ఈ వ్యవహారం సద్దు మనగడంతో శనివారం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

తాజాగా ఓ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు కరోనాతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా 24 గంటలకే లక్షా 15 వేల రూపాయలు కట్టాలని చెప్పారు. ఆమె తాను వైద్యురాలినే, ఇంత బిల్లు వేశారు ఏమిటి అని నిలదీయగా ఆమెను డిశ్చార్జ్ చేయకుండా నిర్బంధించారు. దీనితో ఆమె ఈ ప్రైవేట్ ఆసుపత్రిలో పడుతున్న ఇబ్బందిని తెలియజేస్తూ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియా పోస్ట్ చేశారు. దీనితో ఆమెను ఆదివారం తెల్లవారుజామున డిశ్చార్జ్ చేశారు.

కరోనా విపత్కర పరిస్థితులను ఆసరాగా చేసుకొని పలు కార్పొరేట్ ఆసుపత్రులు పేషెంట్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు అనడానికి ఇవి ఉదాహరణ లుగా నిలుస్తున్నాయి.

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju