NewsOrbit
Featured రాజ‌కీయాలు

నిమ్మగడ్డ కేసులో పాఠం…! మారాల్సింది కోర్టులు కాదు… జగన్ మెదడే…!

Nimmagadda VS CM Jagan : Big Fight soon

చట్టం ఎక్కడైనా ఒక్కటే కదా…! న్యాయం ఎక్కడైనా ఒక్కటే కదా.., రాజ్యాంగం, ఆర్టికల్లు ఎక్కడైనా ఒక్కటే కదా…! మరి ఈ విషయం జగన్ ఎందుకు గుర్తెరగడం లేదు…! ఒక్క క్లాజు, ఒక్క పాయింటుని పట్టుకుని కోర్టుల్లో కేసులు వేస్తే నిలబడతాయా…?? ఇలా ఎన్ని కేసుల్లో ఎన్నిసార్లు కోర్టులు మార్చిన జగన్ అనుకున్నది జరగదు, అందుకే మార్చాల్సింది కోర్టులు కాదు, సీఎం జగనే.., ఆయన మెదడే మారాలి. ఇప్పుడు ఎందుకు ఈ విషయం అంటే “నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరించింది” ఈ మేరకు తాజాగా బుధవారం మధ్యాహ్నం వెల్లడించింది. పూర్తిస్థాయి విచారణను మూడు వారాలు వాయిదా వేసింది. అంటే ఒకరకంగా హైకోర్టు తీర్పే, సుప్రీం లో కూడా రాబోతుంది. జగన్ కి ఇదీ గట్టి దెబ్బ.

 

హైకోర్టు చాలా… సుప్రీం రెండు…!

ఇప్పటికే ఏపీ హైకోర్టులో ప్రభుత్వానికి చాల ఎదురు దెబ్బలు తగిలాయి. ప్రభుత్వ పెద్దలు దాదాపు 70 వరకు దెబ్బలు తిన్నారు. వీటిలో కొన్ని కేసులను సుప్రీం కి వెళ్లారు. అక్కడ కూడా కింది కోర్టు ఇచ్చిన తీర్పులే సబబని తేలింది. ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి రంగుల వ్యవహారంలో గత నెలలోనే సుప్రీం తీర్పు ఇచ్చింది. ఆ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీం సమర్ధించింది. తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలోనూ ఇదే జరుగుతుంది. ఏమో ఇక మిగిలి ఉన్న ఇంగ్లిష్ మీడియం వ్యవహారం లోనూ అదే జరుగుతుందేమో చెప్పలేం. ఇవన్నీ జగన్ కి పాఠాలే. కానీ నేర్చుకోవడం లేదు. వచ్చిన పాఠాలని పక్కన పెట్టేసి జగన్ కొత్త తప్పులకు దారి వెతుకుతున్నారు.

ఇదే సరైన పరిష్కారం…!

కోర్టులు మారవు. ఎందుకంటే అందులో ఉన్న న్యాయ పాయింట్లు, ఆర్టికల్లు, చట్టాలు వాటికి తెలుసు. అందుకే జగనే మారాలి. జగన్ ఆలోచనలే మారాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు “తనకు తోచినట్టు.., తాను అనుకున్న నిర్ణయం అమలు చేయకుండా..” చట్టంలో ఉన్న పాయింట్లులో తనకు అనుకూలమైనవి తీసుకుని అమలుకు పూనుకుంటే కొంత ప్రయోజనం ఉండవచ్చు. లేకుంటే హైకోర్టులో సెంచరీలు.., సుప్రీంలో అర్ధ సెంచరీలు తప్పవు. నయన నిపుణులు ఉండాలి, ఐఏఎస్ వంటి మేధావులు ఉండాలి… వారి మాటని జగన్ వినాలి, సమీక్షించాలి. అప్పుడే ఢిల్లీ స్థాయి కోర్టుల్లో అయినా పరువు దక్కుతుంది.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju