NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జగన్ ప్లాన్ అదిరింది బాసు.. ఎమ్మెల్సీల కేటాయింపులో అంతరార్థం ఇదే..!!

శాసనమండలిలో ఖాళీలను భర్తీ చేసే క్రమంలో వైసిపి అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీల కేటాయింపును చూస్తే ఆయన ఎంత పరిశీలన చేసి, ఎంత లోతుగా విశ్లేషించుకుని ఇస్తున్నారా అనేది అర్థం అవుతుంది. సామాజిక వర్గాలు, ప్రాంతాలు, రాజకీయ సమీకరణాలు అన్ని బేరీజు వేసుకుని చాలా పకడ్బందీతో భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని చూసుకుని ఇస్తున్నారు. చిలకలూరిపేట వైసీపీ మాజీ ఇంచార్జి మర్రి రాజశేఖర్ కు ఒకటి ఖరారైనట్టు మాటలు వినిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొయ్యే మోషేన్ రాజుకు కూడా మరో ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ రెండింటితో పాటు రాయలసీమకు చెందిన ఒక మైనార్టీ నాయకుడికి కూడా ఎమ్మెల్సీ కేటాయిస్తారని అంటున్నారు. అంటే మూడు ఎమ్మెల్సీలు మూడు భిన్న వర్గాలకు ఇవ్వడం ద్వారా జగన్ ఏం చెప్ప దల్చుకున్నారో పకడ్బందీగా అర్థమవుతుంది. తన సొంత సామజిక వర్గం కాకుండా ఇతరులకు ఇవ్వడం ద్వారా జగన్ అంతర ఉద్దేశం ఏమిటి అన్నది చెప్పకనే చెప్పారు.

మర్రి రాజశేఖర్ 2014లో తరువాత నుంచి చిలకలూరిపేట నియోజకవర్గానికి వైసీపీ ఇంచార్జి గా ఉన్నారు. నాడు అధికార పార్టీ టిడిపిని తట్టుకుని ఆ నియోజకవర్గంలో పార్టీని కొంత మేర నిర్మాణం చేశారు. ఈ నేపథ్యంలో లోనే ఎన్నికలకు ఏడాది ముందు దూసుకొచ్చిన పార్టీలో చేరి టికెట్ సంపాదించుకున్న విడుదల రజిని ఎమ్మెల్యే గెలిచి పెత్తనం చలాయిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో జగన్ కంటే, పార్టీ కంటే తానే ముఖ్యం, తనదే అంతా హవా అన్నట్లు విడుదల రజిని ప్రవర్తన ఉంటోంది. ఒక్కో సారి ఆమె సమావేశాల్లోనూ, బయట కూడా జగన్ ఫోటో, పార్టీ సింబల్ లేకుండా వ్యక్తిగతంగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. వేటినంటిని గమనించిన పార్టీ పెద్దలు.. ఆమె హవాకు చెక్ పెట్టి క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మించిన మర్రి రాజశేఖర్ కు కూడా పెద్ద ఇస్తే బాగుంటుందని యోచనకు వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో పాటు రాష్ట్ర స్థాయిలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు ప్రాధాన్యత ఇస్తే జగన్ కు కమ్మ వ్యతిరేకి అనే భావన కూడా పోతుంది. అటు నియోజకవర్గంలో కూడా కమ్మ సామాజిక వర్గం ఓటర్ల ప్రాధాన్యత ఎక్కువగా ఉండటంతో మర్రి రాజశేఖర్ ను ఎంపిక చేసినట్టు వైసీపీలో అంతర్గత సంబంధం జరుగుతుంది. ఇటు స్థానిక రాజకీయ పరిస్థితులు, అటు ఎమ్మెల్యే పెత్తనం కొంత తగ్గించడం, రాష్ట్ర స్థాయిలో సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నామని సంకేతాలు పంపించడం ఇలా బహుముఖ వ్యహంతో మర్రి రాజశేఖర్ ను ఎంపిక చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని పక్కన పెడితే..

* పశ్చిమగోదావరి జిల్లాలోని వైసిపి సీనియర్ నాయకులు కొయ్య మోషేన్ రాజుకు ఎమ్మెల్సీ కేటాయిస్తున్నారు అని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ఇది కూడా జగన్ పక్కా వ్యూహాత్మక స్టెప్ అనే అనుకోవాలి. మోషేన్ రాజు వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు. 2012 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో కొవ్వూరు నుంచి పోటీ చేసేందుకు వైసీపీ టిక్కెట్ ఆశించి భంగపడ్డారు.టికెట్ దక్కకపోవడంతో అప్పటికప్పుడు టిడిపిలో చేరి పోయారు. టిడిపిలో చేరి మళ్ళీ రెండు నెలలు కూడా గడవకముందే వైసీపీ లో జాయిన్ అయ్యారు. అప్పటి నుండి పార్టీకి చురుకుగా పనిచేస్తున్నారు.అటు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ క్షేత్ర స్థాయి నిర్మాణంపై దృష్టి పెట్టి తన సామాజికవర్గం (ఎస్ సీ) కూడా పార్టీ పట్ల ఆకర్షితులయ్యేలా బాగా క్షేత్ర స్థాయిలో పని చేశారు. ముఖ్యంగా రిజర్వ్డ్ నియోజకవర్గాలైన గోపాలపురం, కొవ్వూరు ప్రాంతాల్లో ఎక్కువగా తిరిగారు. పార్టీలో తొమ్మిదేళ్ల నుంచి ఉండడం, ఇప్పటి వరకు ఆశించినంత గుర్తింపు దక్కక పోవడంతో ఇటీవల తన అంతర్గత సంభాషణల్లో అసంతృప్తి బయటపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న అధినేత జగన్ పిలిపించి మాట్లాడి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీ మేరకు ఇప్పుడు అతను కేటాయిస్తున్నారు. ఇక్కడ కూడా ఆ జిల్లాలో ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు ఉండడం, తొమ్మిదేళ్లుగా పార్టీకి అందించిన సేవలకు గుర్తింపు ఇవ్వడం అన్ని కూడా వ్యూహాత్మకంగానే కూడా జరిగాయి.

వీరిద్దరితో పాటు మరో మైనారిటీ నాయకులు కూడా ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా జగన్ ఒక రకంగా మంచి పని చేస్తున్నారనుకోవాలి. ఒకరికి కమ్మ, మరొకరికి ఎస్సీ, ఇంకో మైనారిటీ కి మూడు ఎమ్మెల్సీలు కేటాయించి తాను అన్ని సామాజిక వర్గాలకు సమ న్యాయం చేస్తానని, తన సొంత సామాజిక వర్గానికే కేటాయిస్తున్నారన్న అపవాదు పోగొట్టుకునే క్రమంలోనే జగన్ ఇటువంటి అడుగులు వేస్తున్నారు.

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?