NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

ఆన్ లైన్ విద్యాబోధనలకు అనేక సవాళ్లు.. !!

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో మరో ఏడాది వరకూ  విద్యార్థులు స్కూళ్లకు అటెండ్ అయి పాఠాలు నేర్చుకునే అవకాశం లేదు. ఎవరి ఇళ్లలో వారు ఉంటూ ఆన్ లైన్ పాఠాలే నేర్చుకోవాలి. కానీ ఆన్ లైన్ నేర్చుకోవాలంటే అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ లేని పరిస్థితి ఉంది. అందుకని ఈ మేరకు రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసింది. ఎంత మంది పిల్లలు దగ్గర ఆన్ లైన్ పాఠాలు అందుబాటులో ఉన్నాయి? ఎంత మంది పిల్లల వద్ద స్మార్ట్ ఫోన్ లు ఉన్నాయనే దానిపై సర్వే చేస్తే ఆసక్తికర విషయాలు తెలిశాయి.

రాష్ట్రంలో 26,869 కుటుంబాలపై ఐక్య ఉపాధ్యాయ సంఘం (యూటీఎఫ్‌) నిర్వహించగా, 41.5 శాతం  మంది పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో లేవని తెలిసింది. ఫోన్‌ ఉన్నా పిల్లలకు ఇచ్చే వెసులుబాటు ఉన్న తల్లిదండ్రులు 28.7శాతం ఉన్నారు. ఆన్‌లైన్‌ తరగతులు కొంత వరకే ఉపయోగమని 58.5 శాతం మంది పేర్కొన్నారు. 23శాతం పిల్లలు ఆన్ లైన్ పాఠాలు అర్థం కావట్లేదని తెలిపారు. 3.5శాతం మందికే కంప్యూటర్‌, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌ ఉన్నాయి. ఫోన్లు ఉన్నా డేటా లేని వారు 50.8 శాతం ఉండగా, ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న వారు 7.4శాతం మాత్రమే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ పాఠాలు అందరికీ అందడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

ఈ నేపథ్యంలో పిల్లలు పాఠశాలకు దూరమవు తున్నారనే ఆందోళనను తల్లిదండ్రులు వ్యక్తం చేశారు. తరగతి బోధన ఉండాలని 90.4 శాతం మంది పేర్కొన్నారు. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న చోట పాఠశాలలను తెరవాలని 73.1శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొని పాఠశాలలు తెరిస్తే పంపుతామని 50.1 శాతం మంది వెల్లడించారు. 29.6 శాతం మాత్రం పిల్లల్ని పంపలేమని వెల్లడిస్తున్నారు. సప్తగిరి ఛానల్‌ పాఠాలు 44.9శాతం మందికే అర్థమవుతున్నాయిట. వీటిని 62.4శాతం చూస్తుండగా, టీవీ పాఠాలు సరిపోవని 92.3శాతం మంది తల్లిదండ్రులు వెల్లడించారు.

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N