NewsOrbit
రాజ‌కీయాలు

ఆ ఇల్లు కొంటే  ‘ చావు ‘ గ్యారెంటీ .. ప్రూఫ్స్ ఇదిగో

ఓ ఇంట్లో న‌లుగురు చ‌నిపోయారు. ఆ ఇంటి వెనుక భాగంలో తవ్వకాలు చేపట్టడం, నిమ్మకాయలు లాంటి వివిధ వస్తువులు ఘటనా స్థలంలో

లభించడంతో నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందడం కలకలం రేపింది. వారి మీద విషప్రయోగం జరిగినట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చిన పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు. విష ప్రయోగం జరిగిందా..?ఎంతమంది అక్కడ తవ్వకాలు జరిపారు..?ఇందులో ఎవరెవరి హస్తం ఉంది..? అనేది ఆరా తీస్తున్నారు.

గ్రామ‌స్తులు, మీడియా, పోలీసుల అన‌ధికార స‌మాచారం ప్ర‌కారం, నాగపూర్‌ గ్రామానికి చెందని ఆర్‌ఎంపీ డాక్టర్‌ రహీం, హాజీరాబీకి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో రెండో కుమార్తె ఆష్మాబేగానికి భర్త ఖాజా, కూతురు ఆశ్రీన్‌ ఉన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా వీరన్నపేటకు చెందిన ఖాజా కొంతకాలంగా నాగర్‌కర్నూల్‌లో కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. హాజీరాబీ కొన్నేళ్లుగా ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయని తరచూ కుటుంబసభ్యులతో చర్చిస్తుండేది. ఈనేపథ్యంలో 2014 ఆగస్టు 12న కూడా ఇంటి ఆవరణలో వేపచెట్టు దగ్గర తవ్వకాలు జరుపగా ఎలాంటి నిధులు లభించలేదు.

అయితే, తాజాగా ఖాజా తన భార్య పిల్లలతో కలిసి నాగపూర్‌ గ్రామానికి చేరుకొని గురువారం రాత్రి హజీరాబీ ఇంట్లో తవ్వకాలు జరిపినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఖాజా మృతదేహం ఇంటి వెనకభాగంలో తవ్వకాలు జరిపిన ప్రదేశంలో పడి ఉంది. ఈమేరకు గ్రామస్తులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.

గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. మృతుడు ఖాజా మృతదేహం ఇంటి వెనకభాగంలో తవ్వకాలు జరిపిన ప్రదేశంలో పడి ఉంది. ఇతని పక్కనే నిమ్మకాయలు, కొబ్బరికాయ, గులాబీ పూలు, ఒక కత్తి పడి ఉన్నాయి. పడకగదిలో కూతురు ఆష్మాబేగం ఉండగా ఈమె మృతదేహం పక్కన అత్తర్‌, లోబాన్‌ ఊదు, కర్పూరాలు వంటి సామగ్రి ఉన్నాయి. ఇదిలాఉండ‌గా, ఈ ఇంటి గురించి, అందులో జ‌రిపిన క్షుద్ర‌పూజ‌ల గురించి గ్రామ‌స్తులు ప‌లు ర‌కాలుగా చ‌ర్చించుకుంటున్నారు.

నాగపూర్‌ గ్రామానికి చేరుకున్న ఎస్పీ అపూర్వరావు మృతదేహాలను పరిశీలించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మృతుల్లో హాజీరాం బీ(60),కూతురు ఆష్మాబేగం(35), అల్లుడు ఖాజా (42), మనవరాలు ఆశ్రీన్‌ (7) ఉన్నట్టుగా తెలిపారు. ఇంటి ఆవరణలో క్షుద్రపూజలు నిర్వహించినట్టుగా ప్రాథమికంగా గుర్తించామన్నారు. విచారణ చేపట్టి కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?