NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఆ రాష్ట్రంలో అదృష్టం కాదు…  కష్టం పరీక్షించుకోబోతున్న కేజ్రీవాల్ !

కొన్ని సంవత్సరాల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఒక సంచలనం. దేశ రాజధాని రాష్ట్రంలో ఎంతో అనూహ్యరీతిలో ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న అతను వరుసగా విజయాలు సాధిస్తూ వస్తూ కేంద్ర అధికార పార్టీ బిజెపికి షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి తనకు ఏమాత్రం పట్టు లేని రాష్ట్రం లో పోటీ పడుతున్నాడు. ఆ సంగతేందో చూద్దాం..!

 

Delhi Chief Minister Arvind Kejriwal tests negative for Covid-19 | Cities  News,The Indian Express

బీజేపీ ఆశ అదొక్కటే….

మొత్తం 70 మంది సభ్యులు గల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడానికి బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ నేతృత్వంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలే తమను గట్టున పడేస్తాయని గట్టిగా నమ్ముతోంది. ఇకపొతే కాంగ్రెస్ కూడా చాలా గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఈ దశలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉత్తరాఖండ్ లో పోటీ చేస్తుందని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

వారంతా రమ్మన్నారు

ఇక పోతే తాము కనుక విజయం సాధిస్తే…. ఉత్తరాఖండ్ ప్రజలకు ఢిల్లీలో చేసిన అభివృద్ధిని చేసి చూపిస్తామని కేజ్రీవాల్ చెబుతున్నారు. ఉత్తరాఖండ్ దశాబ్దాలుగా వెనుకబడి ఉన్న నిరుద్యోగం, విద్య, వైద్యం వంటి రంగాలను మెరుగు పరుస్తామని ఆప్ హామీ ఇస్తోంది. దశాబ్దాల కాలం నుండి ఈ రంగాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డాయి అని..  ఆయన అన్నారు. ఖచ్చితంగా ఉత్తరాఖండ్ లో విజయం సాధిస్తామన్న ఆశాభావంతో అరవింద్ కేజ్రివాల్ ఉండగా ముందు జాగ్రత్తగా ఆయన చేయించిన సర్వేలో 62 శాతం మంది ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ ఉత్తరాఖండ్ లో పోటీ చేయాలని కోరుకోవడం గమనార్హం.

పరిస్థితేం బాలేదే….

అయితే కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 20 స్థానాలు గెలుచుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఒకే ఒక స్థానానికి పరిమితమైంది. ఇక గోవా విషయానికి వస్తే డిపాజిట్లు కూడా దక్కలేదు ఇలాంటి నేపథ్యంలో ఎంత సర్వే చేయించినా కూడా ప్రస్తుతం కేజ్రీవాల్ వైపు ప్రజలు మొగ్గు చూపడం అనుమానమే. ఇక ఈ రాష్ట్రంలో ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. త్రిముఖ పోటీ నెలకొంది. ఇప్పటికే పంజాబ్, గోవా  రాష్ట్రాల్లో ఎదురు దెబ్బలు తగలడంతో అస్సలు కేజ్రీవాల్ ఎన్నికల్లో కొంచమైనా ప్రభావం చూపించగలరా అన్నది అందరి అనుమానం.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju