NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

సుప్రీం కోర్టుతో ఆటలా

 

ఢిల్లీ, ఫిబ్రవరి 7: సిబిఐ తాత్కాలిక డైరెక్టర్‌గా పని చేసిన ఎం. నాగేశ్వరరావుకు కోర్టు ధిక్కరణ  నోటీసు జారీ అయ్యింది. బీహార్‌లో ప్రభుత్వ అనాధాశ్రమాలలోని పిల్లలపై అత్యాచారాలకు పాల్పడిన కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ జాయింట్ డైరక్టర్ ఎ.కె. శర్మను బదిలీ చేసినందుకు ఈ నోటీసు జారీ అయింది.

శర్మను బదిలీ చేయరాదని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. బీహార్ కేసును సుప్రీంకోర్టు స్వయంగా పర్యవేక్షిస్తున్నది. గురువారం ఈ కేసు విచారణ సందర్భంగా శర్మ బదిలీ అయినట్లు ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న ప్రధాన న్యాయమూర్తి దృష్టికి వచ్చింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శర్మ బదిలీకి అప్పటి తాత్కాలిక డైరక్టర్ నాగేశ్వరరావు, ఇన్‌ఛార్జ్ ప్రాసిక్యూటర్ భాసురన్‌ను బాధ్యులుగా గుర్తించిన ప్రధాన న్యాయమూర్తి, ‘మీరు మా ఆదేశాలతో ఆటాడుకున్నారు. దేవుడే మిమ్మల్ని రక్షించాలి’ అన్నారు. కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేస్తూ ఈ నెల 12న వ్యక్తిగతంగా హజరుకావాలని ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వం సిబిఐ డైరక్టర్ అలోక్ వర్మను బదిలీపై పంపి నాగేశ్వరావును తాత్కాలిక డైరక్టర్‌గా నియమించినపుడు ఈ బదిలీలు జరిగాయి. శర్మతో పాటు, సిబిఐ స్పెషల్ డైరక్టర్ రాకేష్ ఆస్థానా మీద వచ్చిన ఆభియోగాలపై దర్యాప్తు చేస్తున్న మరో అయిదుగురు అదికారులను కూడా నాగేశ్వరరావు బదిలీ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశానుసారం తిరిగి తన స్థానానికి వచ్చిన అలోక్ వర్మ ఆ బదిలీలను వెంటనే రద్దు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని హైపవర్ కమిటీ ఒక్క రోజులో వర్మను మళ్లీ బదిలీ చేసి తిరిగి నాగేశ్వరరావును తాత్కాలిక డైరక్టర్‌గా నియమించగానే, ఆయన ఎ.కె.శర్మతో సహా ఆ ఆరుగురు అధికారులకూ మళ్లీ స్థానచలనం కల్పించారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Leave a Comment