NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అన్ని రాజకీయాల్లో విజయవాడ రాజకీయాలు వేరయా..!

Vijayawada politics are different from whole andhra and telangana

విజయవాడ లేదా బెజవాడ.. పేరు ఏదైనా కానీ.. ఇక్కడ రాజకీయాల పేరు చెబితే చాలు.. అవి ఎంతో రసవత్తరంగా ఉంటాయి అనే మాట వినిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతంలోని రాజకీయాలైనా కానీ… విజయవాడను మాత్రం మించవు. బెజవాడ అంటేనే భిన్నమైన రాజకీయాలు.

Vijayawada politics are different from whole andhra and telangana
Vijayawada politics are different from whole andhra and telangana

నిజానికి.. ఎక్కడైనా రాజకీయం అంటే రెండు వైపులు ఉంటాయి. ఒకటి అధికార పక్షం, ఇంకోటి ప్రతిపక్షం. కానీ.. విజయవాడ రాజకీయం అలా కాదండోయ్. దశాబ్దాల కింద విజయవాడపేరు చెబితే… రౌడీయిజం గుర్తొచ్చినా.. ఇప్పుడు రౌడీయిజం అంతగా లేకపోయినా.. భిన్నమైన మాటలయుద్ధాలు ఇక్కడ ప్రస్తుతం దర్శనమిస్తున్నాయి.

తాజాగా ఏం జరిగిందంటే… మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమ మధ్య యుద్ధం జరిగింది. అదే.. మాటల యుద్ధం. వీళ్లు మాట్లాడే మాటలు చూస్తే వామ్మో.. ఈ విజయవాడ రాజకీయాలే వేరబ్బా.. అని అనిపిస్తుంది. మాటల యుద్ధమంటే ఏదో ఒకటి అనుకుంటూ పోవడం కాదు..చివరకు బూతులు కూడా ఉంటాయి అందులో.

కొడాలి నాని అయితే ఇక తన నోటికి ఎంత వస్తే అంతే. ఏమాత్రం తగ్గరు. మైకు ముందు ఏమంటారో ఆయనకే తెలియదు. దేవినేనిని పక్కన పెట్టి.. డైరెక్ట్ గా చంద్రాబాబు దగ్గరికే వెళ్లి.. ఆయన్ను ఓ రేంజ్ లో తిట్టేస్తారు.

మరి.. దేవినేని ఏమైనా తక్కువ తిన్నారా? లేదు.. కొడాలిపై బాగానే విరుచుకుపడతారు. కొడాలి గతంలో లారీ క్లీనర్ గా పనిచేశారంటూ ఎద్దేవా చేస్తారు. కొడాలి ఏమో… దేవినేని తండ్రి సోడాలు అమ్ముకున్నాడు.. అంటూ వాళ్లు గతంలో చేసిన పనులపై కూడా విమర్శలు చేస్తుంటారు.

వీళ్లిద్దరు మాటల యుద్ధం స్టార్ట్ చేశారంటూ.. వీళ్ల మధ్య పోవడానికి ఎవ్వరూ సాహసించరు. వీళ్లు వీళ్ల గురించి విమర్శలు చేసుకోవడం, ఆ తర్వాత పార్టీల పెద్దలపై విరుచుకుపడటం.. ఇలా సాగుతుంది వీళ్ల మాటల యుద్ధం.

బూతుల మంత్రి ఎవరో మాకు తెలియదా? రాష్ట్రమంతా పేరు పోయింది కదా… అంటూ దేవినేని ఇన్ డైరెక్ట్ గా కొడాలికి సెటైర్ వేస్తారు. ఆయనతో పాటు టీడీపీ నేతలు కూడా కొడాలిపై విమర్శనాస్త్రాలు సంధిస్తారు. విజయవాడకు చెందిన మరికొందరు నేతలు కూడా విమర్శలు చేయడంలో దిట్టలే. అందుకే.. అన్ని రాజకీయాల్లో విజయవాడ రాజకీయాలు వేరు అని అంటుంటారు రాజకీయ విశ్లేషకులు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju