NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

నిరుపేద కుటుంబాలకు జ‌గ‌న్ మరో వరం…. నేడే సంచ‌ల‌న ప‌థ‌కం

ఓ వైపు క‌రోనా క‌ల‌క‌లం మ‌రోవైపు వ‌ర‌ద‌ల ముప్పు  ఉక్కిరి బిక్కి చేస్తున్న‌ప్ప‌టికీ ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు తాను ఇచ్చిన మాట త‌ప్ప‌కుండా సంక్షేమ ప‌థ‌కాలను అమ‌లు చేస్తున్నారు.

ఆంద్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ వైఎస్‌ ప్రభుత్వం మరో పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. బియ్యం కార్డు కలిగిన కుటుంబాల కష్టాలను గుర్తించి, ఆపత్కాలంలో వారికి బాసటగా నిలుస్తూ ‘వైయస్సార్‌ బీమా పథకం’ అమలు చేస్తోంది. క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి నేడు ఈ పథకాన్ని ప్రారంభించ‌నున్నారు.

జ‌గ‌న్ గొప్ప హృద‌యం

రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబాల్లో అకస్మాత్తుగా కుటుంబ పెద్ద మరణించడం లేదా అంగ వైకల్యానికి గురైన పరిస్థితుల్లో సదరు కుటుంబం పడే అవస్థలను ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ఆర్సీపీ అధినేత‌ వైయస్‌ జగన్‌ స్వయంగా చూశారు. ఆర్థికంగా దిక్కుతోచని పరిస్థితుల్లో పడిన పలు కుటుంబాల దీనావస్థను చూడటమే కాదు, వారి కష్టాలను స్వయంగా విన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఇటువంటి కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా నిలబడాలన్న లక్ష్యంతో వైయస్‌ఆర్‌ బీమా పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రకటించారు. తమ కష్టంతో కుటుంబాన్ని పోషిస్తున్న కుటుంబ పెద్ద సాధారణ లేక ప్రమాదవశాత్తు మరణిస్తే, ఆ కుటుంబం వీధిన పడకుండా వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం వైయస్సార్‌ బీమా పథకం అమలు చేస్తోంది. ఇందుకోసం లబ్ధిదారుల తరఫున బీమా సంస్థలకు రూ.510 కోట్లకు పైగా ప్రీమియం చెల్లించనుంది.

బీమా ప్రయోజనాలు

– ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రైస్‌ కార్డులు కలిగిన కుటుంబాలు వైయస్‌ఆర్‌ బీమా పథకం కింద అర్హులు.
– 18 నుంచి 70 ఏళ్ల లోపు వయస్సు కలిగి వుండి, కుటుంబాన్ని పోషించే వారికి ఈ పథకం వర్తిస్తుంది.
– 18–50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న లబ్ధిదారుడు సహజ మరణం పొందితే రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రూ.5 లక్షలు బీమా పరిహారం చెల్లిస్తారు. అలాగే లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు పూర్తి అంగవైకల్యం పొందితే రూ. 5 లక్షలు బీమా పరిహారం అందిస్తారు.
– ఇక 51–70 ఏళ్ల మధ్య వయస్సు లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రూ.3 లక్షలు పరిహారం లభిస్తుంది.
– శాశ్వత అంగవైకల్యం పొందితే రూ.3 లక్షలు బీమా పరిహారం అందుతుంది. దీనితో పాటు 18–70 సంవత్సరాల వయస్సు గల లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు పాక్షిక, శాశ్వత అంగ వైకల్యానికి గురైతే రూ.1.50 లక్షల బీమా పరిహారం అందిస్తారు.

రూ. 510 కోట్లు

వైయస్సార్‌ బీమా పథకంలో రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ప్రీమియం చెల్లిస్తోంది. ఆ మేరకు రూ.510 కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. దీనివల్ల 1.41 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. ఒకవైపు కోవిడ్‌ వల్ల ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ, నిరుపేద కుటుంబాలకు మేలు చేయాలన్న సంకల్పంతో సీఎం వైయస్‌ జగన్‌ ‘వైయస్సార్‌ బీమా పథకాన్ని’ అమలు చేస్తున్నారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju