NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

ములుగు కలుగులో ఉద్యమ అడుగులు

 

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో పతాక స్థాయిలో ఉన్న నక్సల్ ఉద్యమాన్ని కంట్రోల్ చేయడంలో నక్సల్ నాయకుల స్వీయ తప్పిదాలు(ప్రభుత్వంతో చర్చలు) కొన్ని అయితే, దాన్ని అలాగే ఒక పద్ధతి ప్రకారం నిర్ములన దశకు తీసుకురావడంలో మాత్రం పొలిసు అధికారుల కృషి ఎక్కువే. ఒకానొక సమయంలో రాష్ట్రంలోకి వచ్చేందుకు సైతం నక్సల్ నాయకులు భయపడిన సందర్భాలున్నాయి. అనంతరం నక్సల్ ఉద్యమం కాస్త మావోయిస్టు పార్టీగా మరి స్వరూపం మర్చినా మల్లి అతివాదులు రాష్ట్రంలోకి రావడం తక్కువే అని చెప్పాలి. ఛత్తీస్ ఘడ్ వరకు మాత్రమే ఉద్యమం పరిమితం అయ్యింది. అడపాదడపా చిన్న కదలికలు తప్ప పెద్ద విషయాలు జరగలేదు. అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు ను 2018 లో మావోయిస్టు లు హత్య చేసిన తర్వాత ఆంధ్రలో ఉలిక్కిపాటు ఎదురయింది. తర్వాత ఎలాంటి మావోయిస్టు కదలికలు లేవు. అయితే తెలంగాణాలో ని ములుగు జిల్లాలో వరుసగా జరుగుతున్న పొలిసు ఎన్కౌంటర్లు , దానికి ప్రతిగా మావోలు చర్యలు గుబులు పుట్టిస్తున్నాయి. అక్టోబర్ నెలలో వరుసగా జరిగిన పోలీస్, మావోల చర్యలు ఉద్యమాల గడ్డలో ఎం జరుగుతుందో అన్న టెన్షన్ పుట్టిస్తున్నాయి . మల్లి మావోయిస్టు జాడలు కనిపించడం ఉన్నతస్థాయి చర్చకు దారి తీస్తోంది. ..

తెలంగాణలోని ములుగు జిల్లాలో అక్టోబర్ నెలలోని 4 ఆదివారాల్లో ఎదో ఒక అలజడి జరిగింది. డీజీపీ మహేంద్ర రెడ్డి పర్యటన సమావేశం తర్వాత మావోయిస్టులు తమ ఆధిపత్యం కోసం తెరాస మండల పార్టీ నాయకుడిని హత్య చేయడం సంచలనం అయ్యింది. దీనికి ప్రతిగా పోలీసులు వరుస ఎన్కౌంటర్లకు పాల్పడ్డారు. గత ఆదివారం పోలీసులకు సవాల్ విసిరేలా ఓ హోంగార్డును మావోయిస్టు లు చంపడం గత నెలలో ములుగులో వరుసగా జరిగిన సంఘటలు. దింతో ఇప్పటివరకు తెలంగాణాలో అంతర్గతంగ ఉన్న మావోయిస్టులు ప్రాభల్యం పెంచుకునే దశగా అడుగులు వేస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ములుగు జిల్లా ఎక్కువగా అటవీ, గోదావరి నది పరివాహక ప్రాంతంతో పాటు ఛత్తీస్ ఘడ్ కు సరిహద్దు. దీనితోపాటు గతంలో అత్యధిక మావోయిస్టు ప్రాభల్యం ఉన్న ప్రాంతాలన్నీ ఇక్కడే ఉన్నాయి. మావోయిస్టు సానుభూతి పరులు అధికం. దీనివల్లనే మావోల కదలికలు పెరిగినట్లు .. ములుగు మీదుగానే ఛత్తీస్ ఘడ్ లోకి వారి రాకపోకలు ఎక్కువ అయినట్లు తెలంగాణ పోలీసులు భావిస్తున్నారు. దింతో డీజీపీ ఎక్కడ సమావేశం పెట్టడం, తర్వాత ఎన్కౌంటర్లు ద్వారా హెచ్చరికలు పంపడం దీనికి సంకేతంగానే భావిస్తున్నారు.

 తెరాస దూరమవుతోందా??

గెలిస్తే నక్సల్స్ సిద్ధాంతాలని అమలు చేస్తామని, తెలంగాణ మొదటి ఎన్నికల్లోనే హామీలు ఇచ్చిన  తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తర్వాత దాన్ని విస్మరించారు అనేది మావోయిస్టు నాయకులు చెబుతున్న మాట. అనేక ప్రెస్ స్టేట్మెంట్స్లో వారు ఈ విషయం మీదనే ముఖ్యమంత్రి తీరుని ఎండకట్టారు. అనంతరం తెలంగాణాలో వరుసగా జరిగిన మావోయిస్టు నేతల హత్యలు తెరాస ప్రభుత్వానికి, మావోలకు మరింత దూరం పెంచాయి. ఓ స్థాయిలో మావోయిస్టు నేతలు తెరాస నేతలే లక్ష్యం అని ప్రకటించారు. ప్రభుత్వ వైఖరి, అభివృద్ధి పైన గొంతు ఎత్తారు. దింతో బంగారు తెలంగాణ రాబోతుంది అని భావించిన మావోయిస్టు నేతలకు తెరాస నేతల తీరుతో మరింత దూరం పెరిగింది. ప్రస్తుతం ఒకప్పుడు నక్సల్ ఉద్యమం చురుగ్గా ఉన్న తెలంగాణ గడ్డ మీద మల్లి పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా మావోలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే తమకు పట్టున్న ములుగు వేదికగా పోలీసులు ప్రభుత్వానికి పరోక్ష యుద్ధ సందేశం పంపుతున్నట్లు నిపుణులు, గతంలో ఉద్యమంలో పని చేసేవారు చెబుతున్న మాట. వెంటనే దీనిపై తెరాస ప్రభుత్వం తగిన మేర స్పందించకపోతే పెను నష్టం తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

Related posts

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju