NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

వామ్మో.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 48 మంది ఖైదీల‌ను చంపేశాడు.. అతడు ఎవరో తెలుసా?

కొన్ని వార్త‌ల‌ను చ‌దివితే వెన్నులో వ‌ణుకు పుట్టిస్తాయి. ఆ వార్త‌ను మ‌ర్చిపోవాలంటే చాలా క‌ష్టంగా ఉంటుంది. కొన్ని ఏళ్లైనా అలాంటి వార్త‌లు మ‌న‌కు గుర్తుకు ఉంటాయి. అలాంటిదే ఈ న్యూస్.. అత‌ను ఒక హంత‌కుడు.. జైలు పాలైనాడు.. అయినా అత‌నిలో మార్పులు రాలే.. ఖైదీల‌నే చంప‌డం మొద‌లు పెట్టాడు. ఏకంగా 48 మందిని చంపేశాడు. ఇంకా చంపుతాన‌ని జ‌డ్జి ముందే చెప్పాడు. ఇలా చంప‌డం త‌ప్పుగా అనిపించ‌డం లేద‌ని ఆ ఖైదీ చెబుతున్నాడు.

జైలు సిబ్బందిని సైతం వ‌ణికిస్తున్న ఈ ఖైదీ పేరు మార్కోస్ పౌలో దా సిల్వా. సీరియల్ హత్యలు చేశాడు. దాంతో అంతా లుసీఫర్ అని పిల‌వ‌డం ప్రారంభించారు. 18 ఏళ్ల వయస్సులో చిల్లర దొంగతనాలు చేస్తూ పోలీసులకు దొరికాడు. అలా జైల్లో అడుగుపెట్టిన అతడికి ఏమైందో తెలియ‌దు కానీ.. తోటి ఖైదీలను చంపేస్తూ జైల్లోనే శిక్షల మీద శిక్షల‌ను అనుభ‌విస్తూ వ‌స్తున్నాడు. 1995లో జైల్లో అడుగు పెట్టిన ఇత‌ను మళ్లీ బయట అడుగుపెట్టలేదు. 2011లో బ్రెజిల్‌లోని సావో పాలో జైల్లో ఒకేసారి ఐదుగురి ఖైదీలను చంపేసి వార్తల్లోకి ఎక్కాడు.

లుసీఫర్‌‌‌కు ఇప్పటివరకు పడిన జైలు శిక్షల మొత్తం 217 ఏళ్లు. ఇవి కాకుండా మరిన్ని హత్య కేసులు ఇంకా విచారణలోనే ఉన్నాయి. ఇటీవల ఒక‌ కేసు విచారణలో భాగంగా లుసీఫర్ జడ్జితో చెప్పిన మాట‌లు వింటే భ‌యం వేస్తుంది. అంతమందిని చంపినందుకు నాకు ఎలాంటి పశ్చాతాపం క‌ల‌గ‌టం లేదు. నేను చంపింది రేపిస్టులు, దొంగలు. ఇతర ఖైదీలను దోచుకొనేవారే. వారు చేస్తున్న ప‌నుల‌ను సంహించలేకే చంపేశాన‌ని చెప్పాడు.లుసీఫర్ చేసిన హత్యల వివ‌రాలు ఇప్ప‌టివ‌ర‌కూ బయట ప్రపంచానికి తెలియ‌దు. ఈ మ‌ధ్యే దక్షిణ అమెరికాకు చెందిన యూఓఎల్ అనే మీడియా సంస్థ లుసీఫ‌ర్ నేరాల వివ‌రాల‌ను బ‌య‌ట పెట్టింది.

ఇత‌ను చేస్తున్న హ‌త్య‌ల‌తో లుసీఫర్‌ను తిప్పని జైలంటూ లేదు. ఏ జైలుకు తీసుకుపోయినా.. బేడిలు వేసి కట్టేసినా హత్యలు చేయ‌డం మాత్రం ఆపేవాడు కాదు. మంచిగా నటిస్తూ.. జైలు సిబ్బందని మ‌భ్య పెడుతూ హ‌త్య‌ల‌ను చేస్తూ వ‌చ్చాడు. సెర్రా అజుల్ జైల్లో అయితే మంటలను ఆర్పే సిలిండర్‌తో ఖైదీల తలల‌ను పగలగొట్టాడు. జైల్లో ఉండే కత్తితో తలలను మొండెం నుంచి వేరు చేసేవాడు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju