NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

కరోనా నేర్పిన కొత్త పాఠం.. కొత్త పాకం..!!

 

కొత్త జీవన విధానాన్ని కరోనా లాక్ డౌన్ ఆవిష్కరించింది. ఇప్పుడు ఇళ్లల్లో సీన్ మారిపోయింది. నలభీములు గరిటె తిప్పుతున్నారు. ఉరుకులు, పరుగుల జీవితానికి కామా పెట్టించిన లాక్‌డౌన్‌ ప్రజల్లో కొత్త ఆలోచనలను, సృజనాత్మకతను తట్టి లేపుతోంది. పూర్తిగా ఇళ్లకే పరిమిమతవడంతో కుటుంబాలతో సరదాగా గడపడంతో పాటు తమలో దాగిన నలభీముడిని బయటికి తీసుకు వస్తున్నారు. ఇంతకు ముందు అమ్మ దగ్గర ఓ వంద రూపాయలు తీసుకొని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు వెళ్లి తమకు కావాల్సింది తిని వచ్చేవారు. కానీ ఇప్పుడు మగ పిల్లలు యూట్యూబ్ లో చూసి వంటలు చేస్తున్నారు. అమ్మను వంటింట్లోకి రానివ్వకుండా రెస్టారెంట్ రుచులు ఆస్వాదించేలా ఎలా చేస్తున్నారు.

మునుపటిలా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ లు అంత ఉధృతంగా లేవు. ఇంతకుముందు తమకు ఏం కావాలన్నా ఆర్డర్ చేసుకుని తినేవారు. ప్రస్తుతం కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం లో ఉన్న మగ పిల్లలు ఇంటిని రెస్టారెంట్ గా మార్చేస్తున్నారు. పాకశాస్త్రం తెలియని వారు కూడా యూట్యూబ్ ద్వారా రకరకాల వంటలు చేసి ఇంట్లో వారందరినీ ఆశ్చర్య పరిచేలా చేస్తున్నారు. నీ వంట నువ్వే తయారు చేసుకో అనే ఆరోగ్యకర పద్ధతిని తీసుకు వచ్చారు. వీరి కోసమే అన్నట్లు రకరకాల వంటకాల వీడియోలు తీసి యూట్యూబ్లో పెడుతున్నారు. తందూరి, చైనీస్, మొగలాయి, షవర్మా, దాయ్ లాంటి వంటకాలు తయారుచేసిన నా పిల్లల్ని రుచి చూసిన తల్లులు ప్రశంసల్లో ముంచేస్తున్నారు. ఇంట్లో వారిని మరింత ఆనందింపజేసేందుకు, ఆశ్చర్య పరిచేందుకు యూత్ అంతా ఇంట్లోనే ఇంట్లోనే బార్బీక్యూ అనుభూతి చెందేలా సెట్టింగ్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ ఇంటి పెద్దగా మారింది.

కరోనా పుణ్యమా అని మగ పిల్లలు తల్లుల నిరంతర శ్రమ ను తెలుసుకున్నారు. అమ్మకు విశ్రాంతి ఇవ్వాలి. తనతో ఎక్కువ సమయం గడపాలి,
కాస్త సహాయపడాలి అనే విషయాలను తెలుసుకున్నారు. అమ్మ నాన్నలకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. కాబట్టి వాళ్లకు స్వయంగా నేనే వండి పెట్టడం ఒక అందమైన అనుభూతి లా చెందుతున్నారు మగ పిల్లలు అంతేకాకుండా ఇంట్లో వాళ్ళందరూ కలిసి కూర్చొని తినడం కూడా ఆనందాన్నిస్తుంది. ఆఫీసులో పని ఉద్యోగులు పంచుకుంటారు. అలాగే ఇంట్లో ఒకరి ఒకరు కూరలు తరగడం, వంట చెయ్యడం, మసాలా అందించడం ఇలా విభజించుకుని తలా ఒకరు తలా ఒక పని చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని వారు స్వయంగా తెలుసుకుంటున్నారు.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N