బాలీవుడ్ లో ఖాన్ ల శకం ముగిసిపోయింది అని అంటున్నారు. అక్షయ్ కుమార్ కూడా చాలా లేటుగా సినిమాలు చేస్తున్నాడు. షారుక్ ఖాన్ హిట్ కొట్టి సంవత్సరాలు అయిపోయింది. సల్మాన్ ఖాన్ సినిమాల్లో పస ఉండటం లేదు అని టాక్. రణ్ బీర్ కపూర్ రొమాంటిక్ సినిమాలకు కేRఆఫ్ అడ్రెస్ అయిపోయాడు. రణ్ వీర్ మార్కెట్ కొద్దిగా దెబ్బతింది. ఇలాంటి సమయంలో భారత దేశపు మొట్టమొదటి పాన్ ఇండియా (వరల్డ్) రేంజ్ ఎవరికి ఉంటుంది అన్న ప్రశ్న తలెత్తుతుంది…. అప్పుడు బయటికి వచ్చాడు మన బుజ్జి గాడు…!
వరుసబెట్టి పాన్ ఇండియా సినిమాలు….
బాహుబలి సినిమా తో చిన్నసైజు ఇండస్ట్రీ లన్నింటిని నిమ్మకాయ పైన టిప్పర్ లారీ ఎక్కించినట్లు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రభాస్ ఆ తర్వాత పాన్ ఇండియా రేంజి స్టార్ అనిపించుకున్నాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు హాట్ టాపిక్ కూడా ఇదే. వయసు పరంగా చూస్తే…. మాస్ అప్పీల్ లో చూసినా ప్రభాస్ కు తిరుగులేదు. అతడి ప్లానింగ్ ఒక రేంజ్ లో ఉంది. వరుసపెట్టి పాన్ వరల్డ్ ఇండియా సినిమాలను ప్రకటించడం అంటే మామూలు విషయం కాదు. సాహో తో హిందీ అభిమానులను ఆకట్టుకున్న ప్రభాస్… నాగ అశ్విన్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాలను ప్రకటించేశాడు.
బాలీవుడ్ కే అర్థం కావట్లేదు
అంతెందుకు రాధే శ్యామ్ సినిమాను కూడా ఇప్పుడు ఇండియా వైడ్ గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. తదుపరి యశ్ రాజ్ సంస్థలో ధూమ్-4 లో కూడా ప్రభాస్ ను తీసుకొని తమ మార్కెట్ పెంచుకుందామని ఆలోచిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇక ఇదంతా చూస్తుంటే బాలీవుడ్ లో ఖాన్ ల ప్రస్థానం ముగిసిందా అనుమానం రాకమానదు. మన ప్రభాస్ తెలివైన ఎత్తుగడలతో ఎంత పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నాడు అన్నది అర్థం అవుతుంది. ప్రతిభ ఎంత గొప్పగా పుట్టుకొచ్చినా ప్రపంచం చూసే సామర్థ్యం ప్రదర్శించడం అందరికీ సాధ్యం కాదు.
ఎవరి వళ్ళా కాదు…. మనోళ్ళే
సూర్య, విక్రమ్, రణ్ వీర్ సింగ్, రన్బీర్ కపూర్, హృతిక్ రోషన్. అక్షయ్ కుమార్ వంటి వారికి ఎవరికీ సాధ్యం కాని రీతిలో ప్రభాస్ ఒక రేంజ్ సెట్ చేసి పెట్టేసాడు. బాలీవుడ్ కుర్ర హీరోలు కూడా ప్రతిభ విషయంలో ప్రభాస్ కన్నా ఎక్కువ ఉనా కూడా బాక్సాఫీస్ కొల్లగొట్టే స్టామినా కేవలం ప్రభాస్ రాజు కు మాత్రమే ఉంది. విక్కీ కౌశల్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా అసాధారణ ఫాలోయింగ్ ఉన్న నవతరం స్టార్లు అయితే ప్రభాస్ రేంజ్ కి ఎదిగేందుకు చాలా సమయం పట్టొచ్చు. ప్రభాస్ ఇస్తున్న ప్రోత్సాహం తో ఎన్టీఆర్, చరణ్, బన్నీ కూడా పాన్ ఇండియా ప్రయత్నాలు మొదలు పెట్టేస్తారు. ఇక సౌత్ నుండి బాలీవుడ్ పై దండయాత్ర ని ఆపతరం ఎవరికీ కాదు అని అర్థమవుతోంది.
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!