NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

శ‌బాష్ జ‌గ‌న్‌…. దానికి ముందే చెక్ పెట్టేశావు

కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సెల్ఫీ తీసి, ఆ తర్వాత రైలు కింద పడి చనిపోయిన షేక్‌ అబ్దుల్‌ సలామ్‌ కుటుంబం ఆత్మహత్య ఘటన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే.

అయితే ,ఈ ఆత్మ‌హ‌త్య విష‌యంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్పందించిన తీరుపై రాజ‌కీయ వ‌ర్గాలు ఆస‌క్తిక‌రంగా స్పందిస్తున్నాయి. షేక్‌ అబ్దుల్‌ సలాం, అతని భార్య నూర్జహాన్, కుమారుడు దాదా ఖలందర్, కూతురు సల్మా మృతి పట్ల ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌ను సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్రంగా పరిగణించారు.

వేగంగా స్పందించిన సీఎం జ‌గ‌న్‌

ఈ ఆత్మ‌హ‌త్య‌ సంఘటన త‌న దృష్టికి వచ్చిన వెంటనే, వేగంగా స్పందించిన ముఖ్యమంత్రి, బాధ్యుల మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వయంగా డీజీపీ, ఇంటలిజెన్సు చీఫ్‌లతో మాట్లాడిన సీఎం, ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు కోసం ఇద్దరు ఐపీఎస్‌లు, బెటాలియన్స్‌ ఐజీ శంకబ్రత బాగ్చీ, గుంటూరు అడిషనల్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ను నియమించారు. వారు వెంటనే నంద్యాలకు వెళ్లాలని ఆదేశించారు. ఈ ఘటనపై ఇంకా హోం మంత్రి, డీజీపీ నుంచి ఆయన నివేదిక కోరారు.

24 గంటల్లోనే చర్యలు

షేక్‌ అబ్దుల్‌ సలామ్‌ కుటుంబం ఆత్మహత్యకు బాధ్యులుగా గుర్తించిన సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌ను అరెస్టు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారత శిక్ష్మాస్మృతి (ఐపీసీ) సెక్షన్‌–34లోని సెక్షన్‌–323 (ఉద్దేశపూర్వకంగా వేధించడం, బాధించడం), సెక్షన్‌–324 (మారణాయుధాలు చూపి లేదా ఆ తరహాలో బెదిరించడం), సెక్షన్‌–306 (ఆత్మహత్యకు పురికొల్పడం) కింద సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌పై కేసులు నమోదు చేశారు.

మైనారిటీల హర్షం

షేక్‌ అబ్దుల్‌ సలామ్‌ సెల్ఫీ బయటకు వచ్చిన వెంటనే శర వేగంగా స్పందించిన సీఎం వైయస్‌ జగన్, ఘటనపై దర్యాప్తునకు ఆదేశించడం, ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను సమగ్ర దర్యాప్తు కోసం నియమించడం, ఆ తర్వాత కేవలం 24 గంటల్లోనే ఘటనకు బాధ్యులను గర్తించి, సీఐ, హెడ్‌ కానిస్టేబుల్‌ను అరెస్టు చేయడంపై పలు ముస్లిం మైనారిటీ సంఘాలు హర్షం వక్తం చేశాయి. ప్రభుత్వ చర్యలను మైనారిటీలు స్వాగతించారు. త‌ద్వారా క‌ల‌హాల‌కు చాన్స్ లేకుండా చేశార‌ని అంటున్నారు.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N