NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ బిగ్ స్టోరీ

ఐపీఎల్ గ్యారేజీ : కొట్టినోడికి కొట్టినంత మహా భాగ్యం

 

 


టీమ్ ఇండియా తరఫున బ్లు జెర్సీ వేసుకోవడం ప్రతి క్రికెటర్ కల. గల్లీ దగ్గర నుంచి ఇండియాలో మొదలయ్యే ఈ పిచ్చి యువతలో 90 శాతం మందిలో కనిపిస్తుంది. గతంలో ఒక క్రికెటర్ టీమ్ ఇండియాకు ఆడాలంటే మొదట జిల్లా టీమ్ కు సెలెక్ట్ కావాలి. అక్కడ అండర్ – 14 , అండర్ – 19 లో రాణించాలి. రాష్ట్ర సెలెక్టర్ల దృష్టిలో పడాలి . సాదాసీదాగా రాణిస్తే అసలు వారు పట్టించుకోరు. అన్ని జిల్లాల క్రీడాకారులు రాష్ట్ర జట్టుకు పోటీపడతారు. వారి అందరి అట కంటే మెరుగ్గా రాణించి ప్రత్యేకత చాటితే రాష్ట్ర జట్టులో చోటు ఉంటుంది. చోటు సంపాదించి అక్కడ కూడా బాగా రాణిస్తే సౌత్ ఇండియా ఇండియా జట్టులోకి వెళ్లొచ్చు. దాని తర్వాత ఇండియా బ్లు, ఇండియా గ్రీన్ , ఇండియా ఏ అంటూ కొన్ని జట్ల తరఫున ఆడి ప్రూవ్ చేసుకోవాలి. ఇక మధ్యలో రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీలో రాణించడం క్రికెటర్కు అత్యంత ప్రాధాన్యం. రంజీ మ్యాచ్ల్లో వెలిగితే జాతీయ జట్టు సెలెక్టర్ల దృష్టిలోకి వేగంగా చేరొచ్చు. ఇదంతా క్రికెటర్కు ఒక ప్రాసెస్ లా గతంలా జరిగేది .  మధ్యలో ఎన్నో రాజకీయాలు, ఇంకెన్నో ప్రాధాన్యాలు ఆటగాళ్ల ను పరిక్షిస్తాయి.

మెరుపులెన్నో…

2008 లో ఐపీఎల్ మొదలయ్యాక ఇండియాలో క్రికెట్ మోడల్ మారింది. ఇక్కడ రాణిస్తూ టీమ్ ఇండియాకు ఎంపిక అవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగింది. సెలెక్టర్లు ఐపీఎల్ ను నిశితంగా గమనిస్తున్నారు. ఫలితంగా ఇక్కడ ఆట తీరే ఇండియా జెర్సీ వేసుకునేలా ప్రోత్సహహం ఇస్తుంది. ఈ 2020 ఐపీఎల్ సీజన్ లోను కొందరు కుర్రాళ్ళు అద్భుతంగా రాణిస్తూ ఇండియా జెర్సీ వేసుకునేందుకు తహ తహ లాడుతున్నారు. ముఖ్యంగా ఆన్ క్యాప్డ్ ప్లేయర్లుగా బరిలోకి దిగి, ఎలాంటి అంచనాలు లేకుండానే మంచి ప్రతిభ చూపిన వారెందరో.
* ముంబై : ముంబై ఇండియన్స్ టీమ్ లో అద్భుతం గ రాణించిన వ్యక్తి ఇషాన్ కిషన్. బీహార్కు చెందిన 22 ఏళ్ల యువకుడు టీమ్ ఇండియాకు అతి త్వరలో అదే అవకాశాలు కనిపిస్తున్నాయి. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ గ బరిలోకి దిగే ఇతడి ప్రతిభ అమోఘం. టోర్నీలో హేమాహేమీలను అధిగమించి 32 సిక్స్ లను బాదిన కిషన్ ఫుల్ షాట్ కు తిరుగు ఉండదు.
* ఇక అద్భుత ఫామ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఆట ఈ సీజన్లో ప్రత్యేకత చాటుకుంది. గతంలో ఎలా క్రీజులోకి వచ్చి ఆలా వెళ్లిపోతాడని పేరున్న ఈ ముంబై ఆటగాడు తన కెరీర్లో ఇండియా జెర్సీ వేసుకోవాలని బలంగా భావిస్తున్నట్లు అతడి ఆట తీరుతో అర్ధం అవుతుంది.
ఢిల్లీ : కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తన ఆట తీరును నాయకత్వ లక్షణాలు చక్కగా ప్రదర్శించి సెలక్టర్ల దృష్టిలోకి వెళ్ళాడు. అండర్ – 19 టీమ్ ఇండియాలో అద్భుతంగా రాణించిన 25 ఏళ్ల ఈ యువకెరటం ప్రాక్టీస్ లో రాటుదేలి సుమారు 12 పటు నట్స్ లో సాధన చేస్తూ ఇండియా తీరంలో చోటుకు పరితపిస్తున్నాడు.
*చెన్నై : చెన్నై టీమ్లోకి చివర్లో వచ్చిన రుతు రాజ్ గైక్వాడ్ ఒక ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. ఆడిన 3 మ్యాచ్ల్లో 140 స్ట్రైక్ రేట్ తో అద్భుతంగా ఆడిన యువకెరటం బ్లు జెర్సీ కు అర్హుడే.
*బెంగళూరు : రాయల్ చాలెంజెర్స్ జట్టులో ఓపెనర్గా వచ్చిన దేవదూత పాడిక్కాల్ కు మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. టోర్నీలోనే ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్న 20 కుర్రాడి ఫుట్ వర్క్, షాట్స్ ఎంపిక బాగుంది. మరింత రేటు దేలితే ఒక మంచి ఓపెనర్ ఇండియాకు దొరికినట్లే.
* హైద్రాబాద్ : సన్ రైజర్స్ జట్టులో నటరాజన్ బౌలింగ్ మీద అందరి కన్ను ఉంది. చక్కటి లైన్ లెన్త్ అందిపుచ్చుకుని, డెత్ ఓవర్ లలో సైతం మంచి యార్కర్లతో విరుచుకుపడుతున్న ఇతడి బౌలింగ్ ఇండియా టీమ్ కు అవసరం. బ్లు జెర్సీకు నటరాజన్ ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో అర్హుడుగానే భావించాలి.
రాజస్థాన్ : రాహుల్ తేవాతియా అల్ రౌండ్ర్గా రాణిస్తున్న క్రికెటర్. ఇటు లెగ్ బ్రేక్ బౌలర్ గ, అటు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ గ పట్టు సాధించి మ్యాచ్ విన్నెర్గా పేరు సంపాదించినా తేవాతియా అందరి దృష్టిలో పడ్డాడు.
*కోల్కతా : నితీష్ రానా బాటింగ్ అందరిని ఆకట్టుకుంది. మంచి ఫుట్ వర్క్ తో పటు మిడిల్ ఆర్డర్లో నిలకడగా రాణించే సత్తా ఉన్న నితీష్ ఆట తీరు కోల్కతా తీరంలో చెప్పుకోదగినది.
*పంజాబ్ : కింగ్స్ తీరంలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ బాగానే రాణించాడు. ఓపెనర్ గ మంచి స్కోర్లు సాధించిన ఈ ఆటగాడు ఎప్పటినుంచో టీమ్ ఇండియా పిలుపు కోసం వేచి చూస్తున్నాడు.

Related posts

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju