గంగోత్రి సినిమాలో హీరో రోల్ ద్వారా స్టైలీష్ స్టార్ అల్లూ అర్జున్ వెండితెరమీద అడుగుపెట్టారు. ఈ సినిమా హిట్ కావడంతో ఆయనకు మరెన్నో సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకున్నారు. ఈయనకున్న టాలెంట్ తో బన్ని అగ్రకథానాయకుడిగా మంచి పేరు సంపాధించుకున్నారు. తనకంటూ ఒక బ్రాండ్ ను పొందారు అల్లు అర్జున్. మరీ ముఖ్యంగా డాన్స్ తో అందరి మనస్సును కొల్లగొట్టారు ఈ హీరో.. సినిమాల్లో యాక్షన్ సీన్స్ పండిస్తూ, కమెడీలోనూ తక్కువగా లేకుండా తన పాత్రకు 100 శాతం న్యాయం చేసి ప్రేక్షకుల అభిమానాలను అందుకుంటున్నారు ఈ హీరో.
కాగా రీసెంట్ గా అలా వైకుంటపురంలో సినిమాతో బన్ని బాబు బాక్సాపీస్ ను బద్దలు కొట్టారు. కాగా ఈ మూవీ తర్వాత బన్నికి చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. దీనిలో భాగంగా బన్ని పుష్ప సినిమాల్లో నటించడానికి సిద్ధమయ్యారు. కాని ఈ సినిమా షూటింగ్ మొదలు కాకుండానే ఈ కరోనా మహమ్మారి రాకతో లాక్ డౌన్ చేయడం మూలంగా ఈ ‘పుష్ప’ ఆగిపోవాల్సి వచ్చింది. కాగా ఈ మూవీని క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీలో కథానాయికగా రష్మికా మందాన్న నటించబోతున్నారు.
అయితే ఈ మూవీనీ వాయిదాలు వేసుకుంటూ వేసుకుంటూ ఎట్టకేలకు ఈ నెల 10 న షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన అల్లు అర్జున్ ఫోటోను కూడా రిలీజ్ చేయడం మూలంగా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఆడియెన్స్. ఈ ఫోటోలో బన్ని డిఫరెంట్ లుక్ తో కనిపిస్తారు.ఇంకేముంది ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి తెగ చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్ సినిమాలంటే ఓ రేంజ్ లో ఉంటాయి కదా.. అందుకే ఈ ఫోటో తో బన్ని ఏ విధంగా తెరపై కనిపించనున్నాడనో నని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా ఫస్ట్ లుక్ ఫోటోనే ఇంత డిఫరెంట్ గా ఉంటే మరి సినిమా ఏ రేజ్ లో ఉంటుందోనని అభిమానులు అనుకుంటున్నారు. ఈ సినిమా ఫస్ట్ షూట్ ను ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లలోని మన్య ప్రాతం మారేడిమిల్లి డీప్ ఫారెస్ట్ లో పుష్ప టీం షూటింగ్ ను మొదలు పెట్టారు. ఈ షూటింగ్ లో భాగంగా అల్లు నడిచివెళుతున్న పిక్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. అసలు ఇందులో ఉన్నది బన్నీనేనా అని అనిపించేలా ఉన్నారు. ఈ ఫోటోలో బన్ని అడవిలో నడుచుకుంటూ వెళుతున్నాడు. అయితే ఈ మూవీ ముత్తశెట్టి మీడియాతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ కలిసి ఈ సినిమాను భారీ రేంజ్ లో తీసేందుకు సిద్దమవుతున్నారు. పుష్ప తో అల్లు అర్జున్ తన అభిమానులను కుషీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!