NewsOrbit
Featured రాజ‌కీయాలు

దుబ్బాక దెబ్బకు హైదరాబాద్ లో వరాలు..!! యువరాజు రాజకీయం షురూ..!

dubbaka effect on ghmc elections

‘లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తాం..’ ఇది దుబ్బాక ఉప ఎన్నికల ముందు మంత్రి హరీశ్ ధీటైన వ్యాఖ్యలు. ‘గెలిస్తే పొంగిపోం.. ఓడితే కుంగిపోం’ అదే దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల తర్వాత మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు. మొదటి వ్యాఖ్య.. రాష్ట్రంలో తమ ఏకచత్రాధిపత్యానికి నిదర్శనమైతే.. రెండో వ్యాఖ్య ప్రజా వ్యతిరేకత పుట్టించిన భయం. ఎంపీగా కవిత ఓడినా అది టీఆర్ఎస్ ఓటమి కాదు.. బీజేపీ గెలుపూ కాదు. ఆ ఓటమి కేసీఆర్ కు వ్యక్తిగతంగా లాస్.. పార్టీకి కాదు. కానీ.. దుబ్బాక దెబ్బ ఏకంగా పార్టీనే కుదిపేసింది. ఏకంగా.. అమ్మో..! జాగ్రత్త పడాలి.. అనేంతగా. ఇప్పుడదే చేస్తోంది. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలను ఇందుకు అనుకూలంగా మార్చుకుంటోంది. మంత్రి కేసీఆర్ ప్రకటించిన వరాలు అలానే అనిపిస్తున్నాయి.

dubbaka effect on ghmc elections
dubbaka effect on ghmc elections

హైదరాబాద్ ప్రజలకు వరాలు..

మహానగర ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు మంత్రి కేటీఆర్ వరాలు ప్రకటించారు.. ఆస్తిప‌న్నులో 50 శాతం రాయితీ, జీహెచ్ఎంసీ కార్మికుల‌కు 3వేలు చొప్పున వేత‌నాల పెంపు, వ‌ర‌ద సాయం కొన‌సాగింపు ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 2020-21కి ఆస్తిపన్నులో 15వేలు క‌ట్టిన వారికి 50 శాతం రాయితీ, రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల్లో 10వేలలోపు ఆస్తి ప‌న్ను క‌ట్టిన వారికి 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు ఉన్న 14500 వేతనాన్ని 17500 కు పెంచారు. వరద సాయం అందని వారు మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. మొత్తంగా వందల కోట్ల అదనపు భారానికి సిద్దమయ్యారు. అయితే ఉన్నట్టుండి ఈ ప్రకటనలేంటి మహాశయా అంటే.. ఇవి ఎన్నికల తాయిలాలు ఓటరయ్యా అనిపించక అనిపించదు.

టీఆర్ఎస్ ముందున్న లక్ష్యాలు ఇవే..

వరదలే వచ్చినా.. సమస్యలే చుట్టుముట్టినా.. తమ ఆధిపత్యానికి తిరుగుండదనే ఇన్నాళ్లూ భావించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ.. దుబ్బాక దెబ్బ మామూలుగా తగల్లేదు. టీఆర్ఎస్ ఆలోచనలను నేలకు దించిన ఫలితమది. 2016 గ్రేటర్ ఎన్నికల్లో 99 స్థానాలు గెలిపించారు కేటీఆర్. ఇప్పుడా మ్యాజిక్ మీద నీలినీడలు కమ్ముకున్నాయి. కవిత ఓటమి, ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు, హైదరాబాద్ లో వరదలు సమాధానం లేకుండా చేశాయి. గెలుపు తప్ప ఓటమి ఎరుగని టీఆర్ఎస్ ముందు ఇప్పుడు రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి.. గ్రేటర్ పై ఆధిపత్యం నిలబెట్టుకోవడం, రెండు.. బీజేపీకి మళ్లీ అవకాశం దక్కకుండా చేయడం.

 

Related posts

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju