NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

మెరిసిపోతున్న కరోనా మాస్క్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!

క‌రోనా వైర‌స్ (కోవిడ్‌-19) సృష్టించిన క‌ల్లోకం అంతాఇంతా కాదు. ఎన్న‌డూ త‌మ ఆరోగ్యం గురించి శ్ర‌ద్ధ వ‌హించ‌కుండా నిర్ల‌క్ష్యంలో ఉండే వారిని సైతం మార్చిప‌డేసింది క‌రోనా వైర‌స్. మొద‌టి ప్రాధాన్యం ఆరోగ్యానికే అనే విధంగా అంద‌రిలోనూ మార్పు వ‌చ్చింది అంటే అది క‌రోనా వ‌ల్ల‌నే. మ‌రీ ముఖ్యంగా మాస్క్ లేకుండా ప్ర‌జ‌లేవ‌రూ కూడా బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఒక‌వేళ మాస్క్ పెట్టుకోకుండా ఇంటి నుంచి బ‌య‌ట‌కు అడుగుపెట్టే లోపే ఎవ‌రోఒక‌రూ ఆ విష‌యాన్ని గుర్తుచేస్తారు.

అంత‌లా మాస్కుల‌తో నేడు బంధం కుదిరింది. అయితే, క‌రోనా విజృంభ‌ణకు ముందు కూడా మాస్కులు ఉన్నాయి. కానీ కోవిడ్‌-19 అనంత‌రం వీటి వాడ‌కం పెర‌గ‌డంతో పాటు ర‌క‌ర‌కాల మాస్కులు మార్కెట్ లోకి వ‌చ్చి ప్రాచుర్యం పొందాయి. సాధార‌ణంగా మాస్కులు అంటే ఎన్‌-95 మాస్కులు, స‌ర్జిక‌ల్ మాస్కులు, రిస్పిరేటర్స్ మాస్కులు, ఎన్ 100, ఆర్‌95, పీ95, పీ100 మాస్కులు గుర్తొస్తాయి. కానీ వీటీకి భిన్నంగా చాలా మాస్కులు నేడు మార్కెట్‌లో ఉన్నాయి. అలా కొత్త‌గా క‌నిపిస్తున్న వాటిని పెట్టుకున్న‌వారిని చూస్తే.. ఆశ్చ‌ర్యంతో పాటు వింత‌గా అనిపించిన‌ప్ప‌టికీ.. ఎవ‌రిపిచ్చి వారిది అనిపిస్తుంది.

అలాంటి వాటిలో ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సింది బంగారంతో చేసిన మాస్కు. అయితే, దీనిని మించిన ఓ మాస్కు మార్కెట్‌లో నేడు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. దాని ధ‌ర ఎంతో తెలిస్తే.. దేవుడా.. అంత ఖ‌రీదైన‌దా..! అంటూ నోరెళ్ల‌బెట్టెస్తారు. అంత‌లా షాక్ గురిచేసే మాస్క్ ఎంటి అనుకుంటున్నారా? దాని ప్ర‌త్యేక‌త అలాంటిది మ‌రి ! ఆ మాస్కు ధ‌రెంతో తెలుసా? 11 కోట్ల రూపాయాలు. మీరు చదివింది నిజ‌మే. అక్ష‌రాల ప‌ద‌కొండు కోట్ల రూపాయాలు ఆ మాస్కు ఖ‌రీదు.

అంత ఖ‌రీదు ఎందుకు అనుకుంటున్నారా? అది మాములు మాస్కు కాదండోయ్‌. బంగారంతో త‌యారు చేసిన ఈ మాస్కులో అత్యంత విలువైన, అరుదైన వ‌జ్రాల‌ను పెట్టి తయారుచేశారు. ఇప్ప‌టివ‌ర‌కూ చాలా మంది మాస్కును ర‌క్ష‌ణ కోస‌మే కాదు స్టేట‌స్ సింబ‌ల్‌గా భావించి చాలా ఖ‌రీదైన‌వే త‌యారు చేయించుకున్నారు. కానీ ఈ వజ్రాల మాస్కు ద‌రిదాపుల్లోకి రాలేదు ఆ మాస్కులు. మిల‌మిల మెరిసిపోతున్న డైమండ్ల‌తో కూడిన ఈ మాస్కును అత్యంత ఖ‌రీదైన అభ‌ర‌ణాలు త‌యారు చేసే ఇజ్రాయిల్‌కు చెందిన యెవెల్ అనే సంస్థ దీనిని త‌యారు చేసింది. ఇందులో న‌లుపు, తెలుపు రంగులో ఉండే అరుదైన, అత్యంత ప్ర‌త్యేక‌మైన 3,608 డైమండ్స్, 250 గ్రాముల బంగారం ఉప‌యోగించారు. దీనిని అమెరికాలో ఉంటున్న ఓ చైనా వ్యాపార‌వేత్త ఆర్డ‌ర్ మేర‌కు త‌యారు చేసిన‌ట్టు డిజైన‌ర్ ఐజాక్ లేవీ తెలిపారు

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju