NewsOrbit
రాజ‌కీయాలు

తమిళనాడులో కొత్త పార్టీ..!? వెనుక బీజేపీ ఉన్నట్టా..? లేనట్టా..!?

how impacts bjp politics in tamilnadu

దేశ రాజకీయాల్లో తమిళనాడు రాజకీయాలు వేరయా.. అంటే అతిశయోక్తి కాదేమో. అక్కడ సినిమాలకు రాజకీయాలకు మధ్య పెద్ద వారధే ఉంది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత.. అక్కడ రాజకీయ ఉద్దండులు. తమిళ సినిమాను శాసించారు.. రాజకీయాలను కూడా అదేస్థాయిలో శాసించడం వారికే చెల్లింది. వారి మరణానంతరం పార్టీల పగ్గాలు నాయకులు నడిస్తున్నారు. కానీ.. ప్రస్తుత తమిళనాడు రాజకీయాలు మరింత రసవత్తరంగా మారబోతున్నాయి. డీఎంకేకు స్టాలిన్ వారసత్వం ఉంది. కానీ.. అన్నాడీఎంకేకు జయలలిత తర్వాత వారసులు ఎవరనేది ఇదిమిద్దంగా తేలకపోయినా.. నేనున్నాను అంటూ వస్తున్నారు శశికళ.

how impacts bjp politics in tamilnadu
how impacts bjp politics in tamilnadu

శశికళ కల నెరవేరేనా..

జయలలిత నిచ్చెలిగా పేరున్న శశికళ అనూహ్య పరిణామాల మధ్య జయలలిత మరణం తర్వాత జైలుకెళ్లారు. ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న ఆమె త్వరలో విడుదల కానున్నారు. శిక్షా కాలం ఇంకా ఉన్నా.. 10కోట్లు జరిమానా కట్టి 2021 జనవరి 27న విడుదల కాబోతున్నారు. అదే ఏడాది వేసవిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆమె విడుదల ఆసక్తి రేపుతోంది. ఆమె జైలుకు వెళ్తూ పళనిస్వామిని సీఎంను చేశారు. ఇప్పుడు వచ్చీరావడంతోనే పార్టీ పగ్గాలు చేపట్టి ఎన్నికలకు సిద్ధం కానున్నారు. తమిళనాడు సీఎం కావాలనేది ఆమె కల. ఇందుకు 10కోట్లు చెల్లించి మరీ వచ్చేస్తున్నారు. అయితే.. ప్రస్తుత తమిళ రాజకీయాలు పద్మవ్యూహంలా మారిపోబోతున్నాయి. ఇందుకు కారణం కొత్త పార్టీలు పుట్టుకురావడమే.

బీజేపీ ప్రభావం పని చేస్తుందా..

తమిళ సినిమా మరోసారి అక్కడి రాజకీయాల్లో ప్రభావం చూపనుంది. కమల్ హాసన్ పార్టీ పెట్టి ఇప్పటికే నడిపిస్తున్నారు. రజినీకాంత్ పార్టీ ప్రకటించినా ఇంకా మీమాంశలో ఉండిపోయారు. మరోవైపు స్టాలిన్ కు అన్న అళగిరి కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. వీటన్నింటికి తోడు తమిళ రాజకీయాలపై బీజేపీ కన్నేసింది. చిన్న పార్టీలను కలుపుకునే పనిలో ఉంది. ఇందులో అన్నాడీఎంకే చేరుతుందా, డీఎంకే చేరుతుందా, రజినీ, కమల్, అళగిరి చేరతారా.. ఏంటనేది క్లారిటీ లేదు. వీరిమధ్యలో శశికళ వచ్చిన అన్నాడీఎంకేకు ప్రజాదరణ దక్కుతుందంటే కొంచెం కష్టమైన పనే. జయలలిత సమాధిపై శపథం చేసి మరీ జైలుకెళ్లిన శశికళకు మరి పై నుంచి అమ్మ ఆశీస్సులు ఉంటాయో లేదో తేలాల్సి ఉంది. పుట్టగొడుగుల్లా ఉన్న తమిళ పార్టీలను చూసి తంబీలు ఎవరికి పట్టం కడతారో మరి.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?