NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేస్తే.. సొన్ పాపిడి వచ్చింది.. చివరికి?

ఆన్ లైన్ షాపింగ్ కు నేటి సమాజం భాగా అలవాటు పడిపోయింది. ఎంతలా అంటే అందులో ఏ ఆఫర్ పెట్టినా గుడ్డిగా నమ్మే స్టేజ్ కి వచ్చారంటే నమ్మండి. అతి చౌకగా ఆన్ లైన్ లో తప్ప మరేదాంట్లో రావనే అతి ఆశతో ఏది చెప్పినా సరే అది నిజం అంటూ నమ్మేస్తుంటారు. అది ఎంత వరకు నిజం.. అంత ఖరీదైన వస్తువులు మరీ ఇంత తక్కువ ధరకు నిజంగా లభిస్తాయా.. అలా ఆఫర్ పెట్టడం వెనకున్న అసలు నిజమేంటి.. ఇందులో ఏమైనా బురిడీ దాగుందా అనేది ఎవరూ ఆలోచించే స్టేజిని ఎప్పుడో దాటారనే చెప్పుకోవచ్చు. చీప్ గా వస్తే పినాయిలైనా తాగుతారు అన్న మాట ఈ వార్త వింటే నిజమేనండోయ్ అనిపిస్తుంది.

మరి అదేంటో ఈ ఆర్టికల్ ను చదివేసి తెలుసుకోండి. మసిపూసి మారడి కాయ చేసినట్టు ఓ వ్యక్తి చేసిన గారడీ మాటలకు ఓ వ్యక్తి నిలువునా మోసపోయాడు. అతి ఖరీదైన వస్తువు అతి చీప్ రేట్ కే మీకు సొంతం కాబోతుంది అంటూ ఓ మోసగాడు నమ్మబలికాడు. అది నమ్మిన వ్యక్తి మాత్రం అడ్డంగా మోసపోయాడు పాపం.. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరె తాలూకాలోని గోపనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. అయితే ఈ గ్రామానికి చెందిన నరసింహామూర్తి దీపావళీ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ మొబైల్ ఫోన్ ను కొనుక్కోవాలని ఆశపడ్డాడు. అదే సమయానికి ఆ మొబైన్ ను కేవలం రూ.1,700 కే అందిస్తామని ఒక వ్యక్తి ఫోన్ చేశాడు.

అది పోస్టల్ శాఖ ద్వారా పార్సర్ రూపంలో వస్తుందని నమ్మించాడు. అది నిజమేననుకుని అతి తక్కువ ధరకు బలే వస్తుంది ఈ ఫోన్ అంటూ నరసింహ మూర్తి మురిసిపోయాడు. దాంతో ఆన్ లైన్ ద్వారా ఆ ఫోన్ ను బుక్ చేసుకున్నారు. తను కలలు కన్న ఫోన్ మరికొన్ని రోజుల్లో తన కళ్ల ముందుకు వస్తుందని అతను వేయి కళ్లతో ఎదురు చూసాడు. అనుకున్న సమయానికే అతనికి ఫోన్ వచ్చింది పార్సల్ ద్వారా. రూ.1,700 చెల్లించి ఫోన్ ఇంటికి తెచ్చుకుని ఎంతో ఆశగా దాన్ని ఓపెన్ చేశాడు. దాన్ని తెరిచి చూసిన అతనికి ఆ ధృష్యాన్ని చూసి అతని కళ్లు తిరిగినంత పనైంది.

అయ్యొ అయ్యయ్యో… నేనేంజేతూ దేవుడా .. నేను నిలువునా మోసపోయానే అంటూ లబోదబోమని గుండెలు బాదుకున్నాడు.. అతను అంతలా రియాక్ట్ అవ్వడానికి ఏం వచ్చిందోననుకుంటున్నారా.. పాపం ఎంతో ఆశగా ఫోన్ కోసం పార్సల్ ను తెరిచిన అతని అందులో సోంపాపిడీ స్వీట్ బాక్స్, ఒక రోల్ గోల్డ్ చైన్ దర్శనమిచ్చేశాయి. ఇంకేముంది దాన్ని చూసిన అతనికి ఏడుపొక్కటే తక్కువంటే నమ్మండి పాపం.. నేను మోసపోయాను బాబోయ్ అంటూ పరుగుపరుగున పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు పాపం ఆ వ్యక్తి.. దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే అతి చౌక ధరకే వస్తువు లభిస్తుందని దాన్ని పొందాలని ప్రయత్నం చేస్తే మాత్రం మీకు కచ్చితంగా బోల్తా కొట్టడం ఖాయమని తెలుసుకోండి.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju