NewsOrbit
న్యూస్ హెల్త్

వరుడు కన్నా వధువు వయసు ఎక్కువ ఉంటే??

వరుడు కన్నా వధువు వయసు ఎక్కువ ఉంటే??

అనాదిగా వస్తున్న మన  సంప్రదాయం లో, వివాహ విషయంలో వరుడు వయసులో పెద్ద వాడై ఉండాలి, వధువు చిన్నదై ఉండాలనేది ఆచారం. అయితే ప్రస్తుత కాలంలో యువత ఆలోచనలో మార్పు వచ్చింది. మోజుకీ, ప్రేమకీ, పెళ్లికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నాయి కొన్ని సంఘటనలు.

వరుడు కన్నా వధువు వయసు ఎక్కువ ఉంటే??రష్యా అధ్యక్షుడు పుతిన్ మాజీ భార్య లిద్మిలా ఓ యువ పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకుంది. 58ఏళ్ల  లిద్మిలా  37 ఏళ్లు యువ వ్యాపారవేత్త నుపెళ్లి చేసుకుంది.  లిద్మిలా వయసులో తనకంటే 21 ఏళ్లు చిన్నోడిని పెళ్లి చేసుకోవడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం అయింది. అయితే ఈ పెళ్లికి సాక్ష్యాలు లేవని అంటున్నవారు కూడా ఉన్నారు .

చైనాలోనూ ఇటువంటి సంఘటన ఒకటి జరిగింది. 38 ఏళ్ల స్త్రీ కోటి రూపాయల ఎదురు కట్నం ఇచ్చి తనకంటే 15 ఏళ్లు చిన్నవాడిని పెళ్లాడింది. మొదట ఈ పెళ్లికి అతని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కోటి రూపాయల కట్నం ఇస్తామనడం తో సంతోషంగా పెళ్లి జరిపించారు. ఆ స్త్రీకి  14 ఏళ్ల కొడుకు కూడా ఉండడం మరో విశేషం. ఆమెను పెళ్లి చేసుకున్న 23 ఏళ్ల యువకుడికి కలిసి వచ్చే కాలం తో పాటు నడిచి వచ్చే కొడుకు దొరికాడు.

మన దేశంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. బీహార్‌లో ఓ 36 ఏళ్ల ఆంటీ, తన కంటే 19 ఏళ్లు చిన్నవాడైన కుర్రాడిని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే నాలుగు రోజులు కాపురం చేసిన తర్వాత ఆ కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు.ఆమె మాత్రం నెల రోజుల జైలు శిక్ష అనంతరం బయటికి వచ్చి, మాజీ భర్తతో కలిసి జీవిస్తోంది.

ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. ఫేస్‌బుక్ లో పరిచయంతో   తనకంటే ఆరేళ్లు చిన్నవాడైన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది 27 ఏళ్ల యువతి. ఇంతకుముందు వేరే వ్యక్తితో విడాకులు తీసుకున్న ఈ స్త్రీ , చిన్నోడైనా మంచి వ్యక్తి అని నమ్మి 21 ఏళ్ల కుర్రాడి ని పెళ్లి చేసుకుంది. అయితే యువతి గర్భం దాల్చిన తర్వాత ఆ కుర్రాడి తల్లిదండ్రులు అతని స్వగ్రామానికి తీసుకెళ్లిపోయారు. మైనర్‌ని మోసం చేసి పెళ్లి చేసుకుందని, ఆ యువతిపై కేసు పెట్టారు. ఆ యువకుడు కూడా తల్లిదండ్రుల వైపు మాట్లాడడం కొసమెరుపు అని చెప్పాలి.

బాలీవుడ్ హీరోయిన్లలో కొందరు తన కంటే వయసులో చిన్న వారిని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఐశ్వర్యారాయ్ తనకంటే వయ్యస్సులో రెండేళ్లు చిన్నవాడైన అభిషేక్ బచ్ఛన్‌ను వివాహం చేసుకుంటే, ప్రియాంక చోప్రా, తన కంటే 11 ఏళ్లు చిన్నవాడైన నిక్ జోనస్‌ను వివాహమాడింది. సచిన్ టెండుల్కర్, అంజలి ప్రేమ పెళ్లి  అందరికీ తెలిసిందే.

ఈ  తరం యువత  వయసు అంటే కేవలం ఓ సంఖ్యగా మాత్రమే విలువ ఇస్తున్నారు. పెళ్లికి వయసుతో సంబంధం లేదని కొందరు భావిస్తుంటే.. తనకంటే పెద్ద వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగా…కలిసోస్తుందని’ మరికొందరునమ్ముతున్నారు. ఇదంతా గమనిస్తున్న సంప్రదాయవాదులు చెబుతున్న మాట ఏమిటో తెలుసా..కొత్త తరంలో కి ప్రవేశించేసాం భవిషత్తులోఅన్ని ఇలాంటివి చూడవలిసి ఉంటుంది అని అంటున్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju