హార్ట్ అటాక్ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ‘అదా శర్మ’. ఫస్ట్ సినిమాతోనే తన క్యూట్ లుక్స్‌తో కుర్రకారుకి హార్ట్ ఎటాక్ తెచ్చిన ఈ భామ, గ్లామర్ షోకి ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ఎంత స్కిన్ షో చేసినా కూడా అవకాశాలు లేక గతకొంత కాలంగా ఇబ్బంది పడుతున్న ఈ బ్యూటీకి టాలీవుడ్ నుంచి మొదలుపెడితే బాలీవుడ్ వరకూ బాషతో సంబంధం లేకుండా ఆఫర్స్ వస్తున్నాయి కానీ లీడ్ హీరోయిన్గా అవకాశాలు మాత్రం పెద్దగా ఛాన్స్‌లు రావడంలేదు. అందం అభినయం రెండూ ఉన్న ఈ అమ్మడు హీరోయిన్ గా ఆఫర్స్ లేకపోవడంతో ఒక మాస్టర్ ప్లాన్ వేసి కెరీర్ సెట్ చేసుకోవాలని చూస్తోంది.
ప్రస్తుతం సీనియర్ హీరో యాంగ్రీ యంగ్ స్టార్ రాజశేఖర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కల్కి’లో హీరోయిన్ గా నటిస్తున్న అదా, తన డాన్స్ టాలెంట్ ని చూపించడానికి ఐటమ్ సాంగ్స్ కి కూడా రెడీ అంటోంది. సినిమా హీరోయిన్గా కంటే ఐటమ్ సాంగ్స్‌కే ఎక్కువ డిమాండ్ ఉండడం, రెమ్యునరేషన్ కూడా మంచిగానే వస్తుడడంతో ఐటమ్ సాంగ్స్ చేయడానికి అదా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఈ క్రమంలోనే నాని నటిస్తున్న జెర్సిలో ఐటమ్ సాంగ్ చెయ్యడానికి అదా శర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాలీవుడ్ సర్కీల్ లో టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా ఈ సాంగ్ షూట్ కూడా అయిపోయిందని వినిపిస్తున్న వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు కానీ స్వతహాగా మంచి డాన్సర్ అయిన అదా శర్మ నిజంగానే ఐటెం సాంగ్ చేస్తే మాత్రం అది సినిమాకే హైలైట్ అయ్యేలా ఉంటుంది.
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?