NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఏ పాఠమైనా ఆన్లైన్ లో..! ఇదో మంచి అవకాశం..!!

 

మీరు చదువుతున్న సబ్జెక్ట్ లో మరింత నాలెడ్జ్ కావాలా..? ఫీజులు చెల్లించిన మంచి ఫ్యాకలిటీ.. దొరకటం లేదా..? దొరికిన సబ్జెక్ట్ నిపుణులులా బోధించడం లేదా..? పోటీ పరీక్షలకు సన్నదవుతున్నరా..? మీ సందేహాలను తీరిచ్చేవారే లేరా..? ఐ ఐ టీ కోర్సులు పూర్తి చేసిన సర్టిఫికేట్ ఇవ్వటం లేదా.. ఆన్లైన్ లో నిపుణుల సూచనలు, సలహాలు కావాలా..? డబ్బులు వెచ్చించిన దొరకని వారు.. కొందరైతే.. ఆర్థిక స్థోమత లేని వారు కొందరు.. మీకు నచ్చిన కోర్సు వీడియోలు ఉచితంగా పొందటమే కాకుండా సర్టిఫికేట్ కూడా కావాలా.. నేర్చుకోవాలన్న తపన ఉండాలే కానీ మార్గం తప్పక దొరుకుతుంది.. సమస్య ఎదైన సమాధానం ఒక్కటే ఎన్‌పీటీఈఎల్‌..! వివిధ సబ్జెక్టుల్లో పట్టు సాధించడానికి 500కు పైగా నాణ్యమైన కోర్సులు అభ్యసించడానికి రిజిస్ట్రేషన్లను ఆహ్వానిస్తోంది..! పూర్తి వివరాలు ఇలా..

విద్యార్హతలతో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌లో ఉచితంగా వీడియో పాఠాలు వింటూ నేర్చుకోవచ్చు. నేషనల్‌ ప్రోగ్రాం ఆన్‌ టెక్నాలజీ ఎన్‌హ్యాన్స్‌డ్‌ లర్నింగ్‌ (ఎన్‌పీటీఈఎల్‌) మరింత పరిజ్ఞానానికీ, కొత్త సబ్జెక్టుల్లో ప్రావీణ్యానికీ ఈ వీడియో పాఠాలు ఉపయోగపడతాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారూ, వీటిలో చేరి తమ పరిధి విస్తరించుకోవచ్చు. కోర్సు చివరిలో పరీక్ష రాసి సర్టిఫికెట్‌ కూడా పొందవచ్చు.
విద్యా నేపథ్యం ఏదైనప్పటికీ ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే కోర్సులను ఈ వేదిక అందిస్తోంది.వాస్తవానికి ఐఐటీల్లో చదివినవారికి ఐఐటీలు ఎటువంటి సర్టిఫికెట్‌ను ఇవ్వవు. కానీ ఎన్‌పీటీఈఎల్‌ ఆన్‌లైన్‌ కోర్సుల వల్ల ఇది సాధ్యపడుతుంది. ఐఐటీల్లో చదవకున్నా ఐఐటీ సర్టిఫికెట్‌ను పొందవచ్చు. ఐఐటీ విద్యను ఇంటిదగ్గరకే తీసుకువచ్చిన ఘనత ఈ ఆన్‌లైన్‌ కోర్సులకు దక్కింది.దేశంలోని ఏ ప్రాంతంలో ఉన్న విద్యార్థులైనా దేశంలోని అత్యుత్తమ ఫ్యాకల్టీలు చెప్పిన పాఠాలను వినవచ్చు.ప్రపంచంలోనే ఇంజినీరింగ్‌, బేసిక్‌ సైన్సెస్‌, ఎంపికచేసిన హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌లో అతిపెద్ద ఆన్‌లైన్‌ నిధిగా దీన్ని చెప్పుకోవచ్చు. సుమారు 471 మిలియన్లకు పైగా ఈ సైట్‌ను వీక్షించారు. 56,000 గంటలకు పైగా వీడియో కంటెంట్‌ ఇలా పలు ప్రత్యేకతలు కలిగిన ఈ సైట్‌ గ్రామీణ స్థాయి నుంచి ఐఐటీల్లో చదువుతున్న ఇంజినీరింగ్‌ విద్యార్థులకు వరంగా పేర్కొనవచ్చు. ఇంజినీరింగ్‌, ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, మేనేజ్‌మెంట్‌, ఫిజిక్స్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌, హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌… ఇలా ఎన్నో విభాగాలూ, సబ్జెక్టుల్లో వీడియో పాఠాలను రూపొందించారు. ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌, మెకానికల్‌, సివిల్‌,ట్ ఎల‌్రక్టికల్‌ అండ్‌ ఎల‌్రక్టానిక్స్‌, మెటలర్జీ, ఏరోస్పేస్‌, ఆర్కిటెక్చర్‌ తదితర బ్రాంచీలవారీగా కోర్సులు లభిస్తున్నాయి. ఇవన్నీ బీటెక్‌, ఎంటెక్‌ చదువుతున్నవారితోపాటు గేట్‌, ఐఈఎస్‌ లాంటి పోటీ పరీక్షార్థులకూ ఉపయోగం.
ఆసక్తి ఉన్నవారు https://nptel.ac.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..

సెషన్‌ వివరాలు :
జనవరి – ఏప్రిల్‌ సెషన్‌లో అన్ని విభాగాలు కలిపి 500కు పైగా కోర్సులను ఉన్నాయి. కోర్సును బట్టి 4, 8, 12 వారాల వ్యవధితో నిర్వహిస్తారు. కోర్సును బట్టి ప్రతివారం సుమారుగా 4 గంటలు వీడియో పాఠాలు అందిస్తారు. సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంది.. అసైన్‌మెంట్లు ఉంటాయి. కోర్సు పూర్తయిన తర్వాత పరీక్ష నిర్వహించి అర్హత సాధించినవారికి ఎల‌్రక్టానిక్‌ సర్టిఫికెట్‌ అందజేస్తారు.. పరీక్ష రాయాలనుకున్నవారు అసైన్‌మెంట్లను పూర్తిచేయడం తప్పనిసరి. ఒక అభ్యర్థి ఎన్ని కోర్సుల్లోనైనా చేరవచ్చు గరిష్ఠంగా 6 పరీక్షలు రాసుకోవచ్చు.. 4,8 వారాల కోర్సులు రెండు విడతల్లో మొదలవుతాయి. నచ్చిన విడతను ఎంచుకోవచ్చు. 4 వారాల కోర్సుల మొదటి సెషన్‌ జనవరి 18న మొదలై ఫిబ్రవరి 21తో ముగుస్తుంది. రెండో విడత ఫిబ్రవరి 15తో మొదలై మార్చి 12తో పూర్తవుతుంది. 8 వారాల కోర్సులు తొలి విడత జనవరి 18 – మార్చి 12 వరకు ఉంటాయి. రెండో విడత ఫిబ్రవరి 15 – ఏప్రిల్‌ 9 వరకు ఉంటాయి. 12 వారాల కోర్సులు మాత్రం జనవరి 18 – ఏప్రిల్‌ 9 వరకు ఒకే విడత ఉంది.
మొదటి సెషన్‌లో చేరడానికి, 12 వారాల కోర్సులకు జనవరి 25లోగా వివరాలు నమోదు చేసుకోవాలి. రెండో సెషన్‌కు గడువు ఫిబ్రవరి 15 వరకు ఉంది.సెషన్‌ 1లో 4, 8 వారాల కోర్సుల్లో చేరినవారికి మార్చి 21న పరీక్షలు నిర్వహిస్తారు. సెషన్‌ 2లో 4, 8 వారాల కోర్సులతోపాటు 12 వారాల కోర్సుల వారికి ఏప్రిల్‌ 24, 25 తేదీల్లో పరీక్షలు ఉంటాయి. విద్యార్థులు, ఉద్యోగులు అందరికీ ఈ కోర్సు
ఉపయోగకరం.

అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఫర్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌ కోర్సు అందిస్తున్నారు.. ప్రభావవంతంగా మాట్లాడడం ఎలాగో ఆచరణాత్మకంగా తెలుసుకోవడానికి ‘స్పీకింగ్‌ ఎఫెక్టివ్‌లీ’ కోర్సు ఎంచుకుంటే చాలు. ఐఐటీ ప్రవేశాలకోసం జేఈఈకి సిద్ధమవుతున్న వారి కోసం, బీఎస్సీ, ఎమ్మెస్సీ, ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థుల కోసం.. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో క్లిష్టమైన అంశాలను తేలికగా అర్థం చేసుకునేలా బోధించడానికి ప్రొఫెసర్లు అందుబాటులో ఉన్నారు.
ఎమోషనల్‌ ఇంటలిజెన్స్‌, సీ, జర్మన్‌, జావా, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, టెస్టింగ్‌, డేటా సైన్స్‌, డేటా ఎనలిటిక్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, పైథాన్‌.. కోర్సులెన్నో ఉన్నాయి. ఆసక్తిగా, అందరినీ ఆకట్టుకునేలా రాయాలనుకునే వారికోసం ఎఫెక్టివ్‌ రైటింగ్‌ కోర్సును అభ్యసించవచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు, వ్యవహార నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ఆశించేవారు సాఫ్ట్‌స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులో చేరిపోవచ్చు.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N