NewsOrbit
న్యూస్ సినిమా

బాలకృష్ణ సినిమాలో యంగ్ హీరో అలా కనిపిస్తే భారీ ప్రయోగమే ..?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తాజాగా రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమా బిబి 3. ఈ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన సింహ, లెజెండ్ చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. కాగా ప్రస్తుతం ఈ కాంబినేషన్ మరోసారి రిపీటవుతుందనగానే నందమూరి అభిమానుల్లో అలాగే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ద్వారక క్రియేషన్స్ బ్యానర్ మీద మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘‘మోనార్క్‌” అన్న పవర్ ఫుల్ టైటిల్ ను పెట్టాలని అనుకుంటున్నారట. ఇదిలా ఉండగా తాజాగా బాలయ్య గురించి మరో విశేషమైన వార్త చక్కర్లు కొడుతుంది.

BB3 teaser out: Balakrishna roars in new film with Boyapati Srinu. Watch -  Movies News

తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన కుమారి 21 ఎఫ్ సినిమాను కన్నడంలో రూపొందించిన దర్శకుడు శ్రీమన్ వేముల.. బాలయ్య కోసం ఓ కథ తయారు చేశారట. అంతే కాదు అది బాలయ్యకు వినిపించడం కూడా జరిగిందట. అయితే ఈ చిత్రంలో నాగ శౌర్య కూడా నటిస్తున్నాడని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో శౌర్య ఇప్పటి వరకు కనిపించని ఒక వినూత్నమైన పాత్రలో కనిపించడానికి ఒప్పుకొని పెద్ద సాహసం చేయబోతున్నట్టు చెప్పుకుంటున్నారు. అదేంటంటే మూగ, చెవిటి వాడిగా నటిస్తున్నాడని ప్రచారం అవుతుంది. ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న ఈ సినిమాలో నాగ శౌర్యది నలభై నిమిషాల పాత్ర అని, ఈ క్యారెక్టర్ సినిమాకు ఎంతో కీలకమని అంటున్నారు.

ఇక బాలయ్య ఎప్పుడు ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్నది తెలియాల్సి ఉంది. ఇకపోతే నాగ శౌర్య కెరీర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చిన శౌర్య చేతిలో ఇప్పుడు ఏకంగా అరడజను సినిమాలు ఉన్నాయట. అయితే సినీ వర్గాల్లో ఈ చిత్రం గురించి టాపిక్ హాట్‌గా సాగుతుందట. అసలే కొత్త దర్శకుడు అందులో బాలయ్య, నాగ శౌర్య కాంబినేషన్‌లో ప్రయోగం నిజానికి ఇది సాహసమే అంటున్నారట కొందరు. ఏది ఏమైనా వీరిద్దరి కాంబో అంటే ఫిలిం నగర్‌లో విపరీతమగా ఆసక్తి ఏర్పడిందట. మరి చూడాలి ఈ చిత్రం ఈ ఇద్దరు హీరోలకు ఎలాంటి సక్సస్ ఇస్తుందో.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri