నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తాజాగా రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమా బిబి 3. ఈ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన సింహ, లెజెండ్ చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. కాగా ప్రస్తుతం ఈ కాంబినేషన్ మరోసారి రిపీటవుతుందనగానే నందమూరి అభిమానుల్లో అలాగే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ద్వారక క్రియేషన్స్ బ్యానర్ మీద మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘‘మోనార్క్” అన్న పవర్ ఫుల్ టైటిల్ ను పెట్టాలని అనుకుంటున్నారట. ఇదిలా ఉండగా తాజాగా బాలయ్య గురించి మరో విశేషమైన వార్త చక్కర్లు కొడుతుంది.
తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన కుమారి 21 ఎఫ్ సినిమాను కన్నడంలో రూపొందించిన దర్శకుడు శ్రీమన్ వేముల.. బాలయ్య కోసం ఓ కథ తయారు చేశారట. అంతే కాదు అది బాలయ్యకు వినిపించడం కూడా జరిగిందట. అయితే ఈ చిత్రంలో నాగ శౌర్య కూడా నటిస్తున్నాడని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో శౌర్య ఇప్పటి వరకు కనిపించని ఒక వినూత్నమైన పాత్రలో కనిపించడానికి ఒప్పుకొని పెద్ద సాహసం చేయబోతున్నట్టు చెప్పుకుంటున్నారు. అదేంటంటే మూగ, చెవిటి వాడిగా నటిస్తున్నాడని ప్రచారం అవుతుంది. ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న ఈ సినిమాలో నాగ శౌర్యది నలభై నిమిషాల పాత్ర అని, ఈ క్యారెక్టర్ సినిమాకు ఎంతో కీలకమని అంటున్నారు.
ఇక బాలయ్య ఎప్పుడు ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్నది తెలియాల్సి ఉంది. ఇకపోతే నాగ శౌర్య కెరీర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చిన శౌర్య చేతిలో ఇప్పుడు ఏకంగా అరడజను సినిమాలు ఉన్నాయట. అయితే సినీ వర్గాల్లో ఈ చిత్రం గురించి టాపిక్ హాట్‌గా సాగుతుందట. అసలే కొత్త దర్శకుడు అందులో బాలయ్య, నాగ శౌర్య కాంబినేషన్లో ప్రయోగం నిజానికి ఇది సాహసమే అంటున్నారట కొందరు. ఏది ఏమైనా వీరిద్దరి కాంబో అంటే ఫిలిం నగర్లో విపరీతమగా ఆసక్తి ఏర్పడిందట. మరి చూడాలి ఈ చిత్రం ఈ ఇద్దరు హీరోలకు ఎలాంటి సక్సస్ ఇస్తుందో.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!