NewsOrbit
న్యూస్ సినిమా

మెగా హీరో ఎంత మొండిగా ధైర్యం చేసినా సోలో బ్రతుకే సినిమాని రానిచ్చేలా లేరుగా ..?

లాక్ డౌన్ కారణంగా భారీగా నష్టపోయిన సినీ నిర్మాతలు ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్యనే ప్రభుత్వం థియేటర్లు తెరుచుకోవచ్చని, సినిమాలు ప్రదర్శించుకోవచ్చని ఆదేశాలు జారీ చేయడంతో ఇదే సమయంగా భావించిన నిర్మాతలు తమ డిమాండ్లను తెరపైకి తీసుకువచ్చారు. వర్చువల్ ప్రింట్ ఫీ వసూలు, రెవెన్యూ షేరింగ్ తదితర విషయాలపై మల్టీప్లెక్స్ యజమానులకు, నిర్మాతలకు మధ్య కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చల్లో ఎలాంటి పరిష్కారం కనిపించలేదు. మల్టీప్లెక్స్ యజమానులు నిర్మాతల డిమాండ్లకు అంగీకారం తెలపకపోవడంతో చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. కానీ ఇదే సమయం అని భావించిన నిర్మాతలు మళ్లీ డిమాండ్లను మల్టీప్లెక్స్ యజమానుల ముందు ఉంచారు.

Solo Brathuke So Better Theme Video: Sai Dharam Tej pledges everyone to  stay single | Telugu Movie News - Times of India

తమ సమస్యలు పరిష్కారం కాకపోతే కొత్త సినిమాలు విడుదల చేసేది లేదంటూ పట్టుబడుతున్నారు బడా నిర్మాతలు. దీంతో క్రిస్మస్, వేళ విడుదల కావాల్సిన సినిమాలపై ప్రస్తుతం సందిగ్ధత కొనసాగుతోంది. నిర్మాతల తీరు చూస్తుంటే అసలు క్రిస్మస్‌కు సినిమాలు విడుదల అవుతాయో లేదోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పాపం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు కొత్త కష్టాలు వచ్చినట్లైంది. క్రిస్మస్ సందర్భంగా సాయి ధరమ్ తేజ్, నభానటేష్ జంటగా నటించిన సోలో బ్రతుకే సోబెటర్ సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. నిర్మాతలు అడ్డుచెప్పినా ఈనెల 25న సినిమా ను రిలీజ్ చేస్తారా అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ మూవీ ప్రయోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు. కరోనా తరువాత థియేటర్లలో రిలీజ్ అయ్యే మొదటి తెలుగు సినిమా కావడంతో కాస్త జోష్ పెంచి ప్రచారం కొనసాగిస్తున్నాడు. రేపు మరో సారి నిర్మాతల సంఘం భేటీ కానుంది. దీంతో వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంటోంది. నిర్మాతలు అడుగుతున్న డిమాండ్స్ ను ఎగ్జిబిటర్లు ఒప్పుకునే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. మరి ఈ అంశంపై జీ వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. మెగా హీరో ఎంత మొండిగా ధైర్యం చేసి సినిమా చేసిన సోలో బ్రతుకే సినిమాని థియేటర్లలో రానిచ్చేలా లేరుగా అన్న నిరాశ అభిమానుల్లో వ్యక్తం అవుతోంది.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !