NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఆ నెక్స్ట్ ఏంటి?? జగన్ బీసీ జపంతో రాలిపోతాయా ఓట్లు!!

 

 

56 మంది బీసీ కార్పొరేషన్ ల చైర్మన్ లు … 672 మంది డైరెక్టర్లు మొత్తంగా 728 మంది…. వీరితోనే సభ వేదిక నిండిపోయింది… బీసీ సంక్రాంతికి మరెవరు రానక్కర్లేదు అన్నట్లుగా సభ ప్రాంగణం మొత్తం డైరెక్టర్లు, చైర్మన్ ల తో పాటు వారి కుటుంబ సభ్యులు, అనుయాయులు, పదవులు ఇప్పించిన ప్రజాప్రతినిధులతో నిండిపోయింది… ఎంతో ఘనంగా బీసీ కులాలకు కార్పొరేషన్ లు ప్రకటించి వారికీ పాలక వర్గాలను వేసిన జగన్ నెక్స్ట్ ఏంటి??? అనే మాటకు మాత్రం సంధానం చెప్పడం లేదు…. ఎందుకంటే…

** బీసీ కార్పొరేషన్ ల కు ప్రత్యేక విధులు ఏమి ప్రభుత్వం నిర్ణయించలేదు. అంటే ఎలాంటి పనులు చేయాలి..? ఎం చేయాలి అనేది ఎవరికీ తెలియదు… అసలు విధులు లేని కార్పొరేషన్ లు ఎందుకు అన్నది ప్రధాన ప్రశ్న. ఎప్పటి వరకు బీసీ సంక్షేమ శాఖా ద్వారా నిర్వర్తించే పనులు కులాల వారీగా విభజించి ఇస్తారు అనుకుంటే మరి బీసీ సంక్షేమ శాఖా ఎం చేస్తుంది?? స్పష్టత లేదు..
** ఏ పని చేయాలన్న నిధులు అవసరం ఉంది. మరి కార్పొరేషన్లకు విధులు ఎలా? ఏ ప్రాతిపదికన నిధులు ఇస్తారు ? జనాభా ప్రాతిపదిక ఇస్తారా? లేక దానికి మరో ప్రత్యామ్నాయం ఉందా? అసలు ఎంత మొత్తం నిధులు ఉంటాయి? ఎలా ఇస్తారు ? అనే దానిపై స్పష్టత లేదు. నిధులు లేకుండా విధులు నిర్వర్తించడం అసాధ్యమే. దీనిపై స్పష్టత లేదు.


** బీసీ కార్పొరేషన్ ప్రభుత్వం ప్రకటించినవి 56 . వీటికి కార్యాలయాలు ఎలా ? పాలకవర్గం సమావేశాలు ఎక్కడ జరుగుతాయి ? కార్పొరేషన్ లకు కార్యాలయాలు లేకుంటే మరి ప్రజలు ఎక్కడికి వచ్చి వారిని కలుస్తారు ? ఏదయినా విషయం చెప్పాలంటే ఎలా వారిని కలవాలి? అసలు కార్యాలయాలు అద్దె ప్రాతిపదికన తీసుకుంటే ప్రభుత్వానికి ఎంతటి భారం? విధులు లేని కార్పొరేషన్లకు కార్యాలయాలు ఇవ్వడం వాళ్ళ వచ్చే ఉపయోగం ఏంటి? స్పష్టత లేదు .
** కార్పొరేషన్ చైర్మన్ కు 65 వేల జీతం, డైరెక్టర్లకు 15 వేల జీతం చొప్పున నిరణయించడం బాగుంది. అయితే ఎలాంటి పని చేయాలి.. చేయించాలి అనేది లేకుండా ఉచితంగా జీతాలు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి? అందులోను ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చే జీతాల వాళ్ళ ప్రభుత్వ ఖజానాకు పడే గండి ఎంత? దీనిపై స్పష్టత లేదు.
** ప్రభుత్వం ఒక పోస్ట్ సృష్టించినపుడు దానికి తగిన ప్రోటోకాల్ ఉంటుంది. విచిత్రంగా కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లకు ప్రభుత్వం ఎలాంటి ప్రోటోకాల్ ఇవ్వలేదు. అయినా ఇటీవల గుంటూరు టోల్ గేట్ దగ్గర రేవతి చేసిన హంగామా జాతీయ మీడియాలోనూ వచ్చింది. ఆమె రచ్చ చేసినపు ఆమె వాహననాయికి సైరన్ ఉండటం చర్చకు దారి తీసింది. ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా ఆమె వాహన సైరన్ పెట్టుకోవడం సైతం పెద్ద అంశమే అయ్యింది. దీనిపై స్పష్టత లేదు.
** బీసీ ల కోసం కార్పొరేషన్లు పెట్టాలని ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. ప్రస్తుతం 56 కులాలకు సంబంధించి కార్పొరేషన్ లు పెట్టారు. మిగిలిన కులాల పరిస్థితి ఏంటీ? వారు ఏదైనా పని నిమిత్తం ఏ అధికారిని కలవాలి ? వారికీ ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారు?? కార్పొరేషన్ల జాబితాలో లేని వారిని నిధులు ఎలా ఇస్తారు ? ఎవరు ఇస్తారు ? దీనికి ఉన్న ప్రాధాన్యాలు ఎలా ? స్పష్టత లేదు ..
** అధికారుల కేటాయింపు ఎలా చేస్తారు ? లేదా కార్పొరేషన్ సభ్యులే సొంత సిబ్బంది ని పెట్టుకోవాలా ? ఎలాంటి అధికారులు లేకుండా వీటి అజమాయిషీ ఎలా ? ఎవరు చూస్తారు ? ఒకవేళ సిబ్బంది ఉంటె కార్యాలయాలు ఉండాలి ? అవేవి లేవు. కనీసం విధులు లేని వారికీ అధికారులు సిబ్బంది నియామకం వల్ల వచ్చే ప్రయోజనం ఎంత … స్పష్టత లేదు.


మొత్తానికి బీసీ కార్పొరేషన్ లకు చైర్మన్ , డైరెక్టర్ లతో ప్రమాణం చూపిస్తే ” బీసీ సంక్రాంతి ” అవ్వదు.. ప్రభుత్వానికి బీసీల ఓట్లు పడవు… దానికి సార్ధకత చేయాలి అంటే విధులు , నిధులు కేటాయించి పక్క ప్రణాళిక పనితీరు ఉంటేనే బీసీ లను జగన్ ప్రసన్నం చేస్కునే వీలు ఉంటుంది… ఈ పని లేని కార్పొరేషన్ల వల్ల ప్రభుత్వానికి వచ్చే మంచి పేరు కంటే… భవిష్యత్తులో ప్రతిపక్షలకు ఓ ఆయుధంగా మాత్రం వీటి పని తీరు ఉంటె జగన్ కు అది దెబ్బె….

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N