ఆర్జీవీ.. రాం గోపాల్ వర్మ.. ఈ పేరు ఒక సంచలనం. రాం గోపాల్ వర్మ ఏమంటూ శివ సినిమా తీసి సంచలనం సృష్ఠించాడో అప్పటి నుంచి సంచలన దర్శకుడు అని పేరు పడిపోయింది. ఇప్పటి వరకు రాం గోపాల్ వర్మ టచ్ చేయని జోనర్ లేదు. ఏది కంటికి కొత్తగా కనిపిస్తే దానితో సినిమా తీసేస్తాడు. పక్కా బిజినెస్ మాన్ ఎలా ఉంటాడు అన్న దానికి ఉదాహరణగా వర్మ ని చూపించొచ్చు. వర్మ దగ్గర శిష్యరికం చేసినవాళ్ళు టాలీవుడ్ తో బాలీవుడ్ లో కూడా స్టార్ డైరెక్టర్స్ గా వెలుగుతున్నారు. ఇండస్ట్రీకి ఇంతమంది కొత్త దర్శకులని పరిచయం చేయడం కేవలం ఒక్క రాం గోపాల్ వర్మ కే సాద్యమైంది.
క్రియేటివ్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో పాపులర్ అయిన కృష్ణవంశీ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాధ్, అలాగే వైవీయస్ చౌదరీ, హరీష్ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ సహా, ఆర్ ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి, భైరవగీత దర్శకుడు సిద్దార్థ్ తాతోలు లాంటి యంగ్ డైరెక్టర్స్ వరకు చాలామంది ఉన్నారు. వర్మ ద్వారా ఇండస్ట్రీకొచ్చి సెటిలైనవాళ్ళ లిస్ట్ చూస్తే కళ్ళు చెదిరిపోవాల్సిందే. వివాదాలకి కేరాఫ్ అడ్రస్ గా మారాడు. అందుకు కారణం వర్మ ఎంచుకునే కాంట్రవర్సీ కథలే. ఎక్కడైన ఒక సంఘటన జరిగి సంచలనం అయితే అదే వర్మ కి కథ.
వెంటనే సినిమా తీసి రిలీజ్ చేస్తాడు. జనాలకి నచ్చుతుందా లేదా.. బిజినెస్ అవుతుందా లేదా అన్నది వర్మ కలలో కూడా ఆలోచించడు. అందుకే వర్మ ఎక్కువగా ఫ్లాపులు తీస్తాడని .. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ అంటాడు. అంతేకాదు వర్మ లాంటి జీనియస్ ఎందుకు ఎక్కువగా ఫ్లాపులు తీస్తారు అన్న దానికి సమాధానం ఒక్కటే. ఎక్కువగా ప్రయోగాలు చేయడమే. ఈ విషయాన్ని కూడా పూరి నే చెప్పుకొచ్చాడు. ఆలోచిస్తే మాత్రం నిజమే అనిపిస్తుంది. లేదంటే ఇన్ని సినిమాలు ఇంతమంది స్టార్ డైరెక్టర్స్ ఈ రోజు ఇండస్ట్రీలో ఉండే అవకాశమే లేదు.