NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

అమ్మో ఇవేమి దా”రుణాలు” : ఆన్ లైన్లో కాల్ మని కేటుగాళ్లు హైద్రాబాద్ ఘటనలో ఎన్నో నిజాలు

 

 

4 వేలు అప్పు అని… 4 నిమిషాల్లో ప్రాసెస్ అని ప్రచారం.. డబ్బులు అవసరం ఉండి యాప్ లోకి వెళ్లి అన్నీ పూర్తి చేసి డబ్బులు క్రెడిట్ చేసే సమయానికి వచ్చేది 2,800. మిగిలిన 1200 ప్రాసెస్ ఫీజు, అప్లికేషన్స్ ఫీజు అని సవలక్ష చెబుతారు… ఈ 4 వేలను 10 రోజుల్లో 5,200 కట్టాలి. అంటే 10 రోజులకు వడ్డీ 1200. అంటే రోజుకు 100 పైనే… ఒక వేళ 10 వ రోజు దాటితే రోజుకు ఎక్సట్రా ఫీజు రోజుకు 94 రూపాయలు. అంటే దాదాపు 100 అనుకోండి. దీంతో పాటు పెరిగే వడ్డీ లెక్క కడతారు. చక్రవడ్డి అన్న మాట. అంటే నెలకు వచ్చే సరికి అది 12 వేలు పైనే అవుతుంది. అంటే 4 వేలు తీసుకున్న పాపానికి రెండు ఇంతలు ఎక్కువ అయ్యింది అన్న మాట… ఇదంతా ఎందుకు అంటే ఆన్లైన్ రుణాల పేరుతో కొత్త కొత్త సంస్థలు వినియోగదారులతో ఆడుతున్న కాల్ మనీ వ్యాపారం… ఒకరు కాదు ఇద్దరు కాదు లక్షల్లో బాధితులు కనిపిస్తున్నారు. లాక్ డౌన్ సమయాన్ని వీరు వినియోగించుకున్న అంతగా ఎవరు వినియోగించుకోలేదు. లాక్ డౌన్ వల్ల కొంత మందికి ఉద్యోగాలు పోయి, డబ్బు కోసం అవసరం ఏర్పడి ఆన్లైన్ రుణ సంస్థలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. మేం ఇస్తామంటే మేము ఇస్తాను డబ్బులు అంటూ.. పోటీపడి మరీ కేవలం ఆధార్ పాన్ కార్డ్ అప్లోడ్ చేస్తే డబ్బులు ఇస్తామని ఆశ చూపి.. రుణాలు ఇచ్చాయి. అవసరం వేల డబ్బులు తీసుకుని తర్వాత వారి వడ్డీ బాధలు భరించలేక ఇప్పుడు వినియోగదారులు సతమతమవుతున్నారు. కట్టకపోతే వినియోగదారుల పరువు తీసేలా ఆన్లైన్లోనే సంస్థలు చేస్తున్న వికృత క్రీడ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. తాజాగా హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకోవడం వెనుక బలమైన కారణాలు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి.

ఎం జరిగింది అంటే ?

తీసుకున్న రుణం సకాలంలో చెల్లించడం లేదంటూ రుణ సంస్థలు వేధించడంతో రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ కు చెందిన సునీల్ బుధవారం బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. సైబరాబాద్ పోలీసులు సునీల్ సెల్ ఫోన్ ను విశ్లేషిస్తుండగా ఆశ్చర్యకరమైన అంశాలు బహిర్గతమవుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన సునీల్ .. జీవనం సాగించడానికి యాప్ ల ద్వారా రుణం తీసుకున్నాడు. ఒక యాప్ ద్వారా తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడానికి మరో యాప్ ను ఆశ్రయించాడు. అలా 35 యాప్ ల ద్వారా దాదాపు రూ.2లక్షల రుణం తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈక్రమంలో సునీల్ ను ఎగవేతదారుగా చిత్రీకరిస్తూ కొన్ని రుణ సంస్థలు బ్లాక్ మెయిల్ చేయడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి మాదిరే చాలామంది ఈ పద్ధతిలో అప్పులు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. రుణగ్రహీతల ఫోన్లలో నంబర్లన్నీ అప్పటికే సేకరిస్తారు కాబట్టి వాటికి ఫోన్ చేసి ఫలానా వ్యక్తి రుణం ఎగ్గొట్టినట్లు మెసేజ్ లు పంపుతుంటారు. ఈ అవమానం భరించలేకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆదాయం లేనివారికి రుణాలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకురారు. కేవలం ఇలాంటి వర్గాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ రుణ యాప్ లు పుట్టుకొస్తున్నాయి. వీటి ద్వారా రుణాలు తీసుకుంటున్న వారిలో మూడొంతుల మంది విద్యార్థులు, నిరుద్యోగులేనని అంచనా.

సునీల్ రుణం తీసుకున్న యాప్ ల జాబితా..

ఇన్ క్యాష్ , క్యాష్ ఎరా, క్యాష్ లయన్ , మాస్టర్ మెలన్ , లక్కీ వాలెట్ , కోకో క్యాష్ , రుపీప్లస్ , ఇండియన్ లోన్ , క్రెడిట్ ఫించ్ , ట్యాప్ క్రెడిట్ , రాథన్ లోన్ , క్యాష్ పోర్ట్ , స్మైల్ లోన్ , క్రెడిట్ డే, క్యాష్ టుడే, లక్కీ రూపీ, గో క్యాష్ , స్నాప్ ఇట్ లోన్ , లోన్ జోన్ , క్విక్ క్యాష్ , పండారూపీస్ , ప్లే క్యాష్ , ధని, లేజీ పే, లోన్ ట్యాప్ , ఐపీపీబీ మొబైల్ , మైక్రెడిట్ , క్విక్ క్రెడిట్ , క్యాష్ ఆన్ , రూపీస్ ప్లస్ , రూపీ నౌ, ఎలిఫెంట్ ఓలన్ , ఆంట్ క్యాష్ , క్విక్ మనీ, అల్ప్ క్యాష్ .

అసలు ఎక్కడిది వీరికి అధికారం??

దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయంప్రతిపత్తి గల ఆర్థిక సంస్థ. దీనికి రాజ్యాంగం లోనూ చోటుంది. దేశంలో ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలు చేసే సంస్థ అయినా ఆర్ బీ ఐ అనుమతి పొందాలి. వారు చేస్తున్న వ్యాపారం ఎలాంటిది ఏమిటి? అనే పూర్తి వివరాలను ఆర్బీఐకి సమర్పించి అనుమతి తీసుకోవాలి. దీనిలో ఎలాంటి తేడాలు వచ్చినా ఆర్థిక కార్యకలాపాలు చట్టం కింద కేసులు నమోదు అవుతాయి. ఇప్పుడు ఆన్లైన్లో ఉన్న సంస్థలు ఏవి ఆర్బీఐ వద్ద కనీసం రిజిస్టర్ అయి కూడా లేవు.. చిన్న దుకాణం ఒక యాప్ పెట్టుకుని అప్పులు ఇస్తున్నాయి. వీరికి ఎలాంటి అనుమతి పత్రాలు లేవు. అప్పులు ఇవ్వడం దానిని వసూలు చేయడానికి స్థానికంగా కొంతమంది రౌడీని ఆశ్రయించడం ఈ యాప్ లో పని. డబ్బులు ఇవ్వని వారి పరువును బజారుకు ఏడ్చేల రచ్చ చేస్తున్నారు. రౌడీలతో భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఇప్పుడు యావత్ భారతదేశంలో ఈ ఆన్లైన్ రుణ సంస్థల అరాచకాలు ఎక్కువయ్యాయి. దీనిపై ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు దీన్ని విచారణకు తీసుకుంది. విచారణ తేదీని ఖరారు చేసింది అయితే ఆ తేదీ వచ్చేలోపు బాధితులకు రక్షణ కల్పించేలా పోలీసులకు తగిన సూచనలు చేసింది. ఆన్లైన్ నుండి సంస్థలతో ఎవరైనా ఇబ్బంది పడితే వెంటనే పోలీసులు కేసు రిజిస్టర్ చేయాలని, కచ్చితంగా వారికి తగిన రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు సూచనలు చేసింది. అయితే ఇది ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అమల్లో లేదు త్వరలోనే కేసు విచారణకు వెళ్లనుంది.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju