NewsOrbit
Featured టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఈ రంగులు పిచ్చితో సాధించేది ఎంత జగన్!!

 

 

**ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి. ఆ పిచ్చి పరాకాష్టకు చేరితే దాని కోసం వారు ఎంతకైనా తెగిస్తారు… ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అయిన వైసిపికి రంగుల పిచ్చి. దీనికోసం వారు ఎన్నెన్నో కొత్త దారులు తొక్కి మరి అన్నిటికీ రంగులు అద్దెస్తున్నారు.. కోర్టులు జోక్యం చేసుకుని రంగులు తొలగించాలని చెప్పినా, ఇప్పుడు ఆ కొత్త దారులు వెతుకుతూనే మరి రంగులు అదే కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం చక్కగా చేస్తోంది… దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే మంచి పేరు, ప్రచారం ఎంతో తెలియదు కానీ.. ప్రతిపక్షాలకు ఓ ప్రధాన ఆయుధాన్ని అధికారి పక్షమే అప్పగిస్తున్నట్లు అవుతోంది. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తోంది. తటస్థ ఓటర్ లు,తటస్థ రాజకీయ విశ్లేషకులు చేసే వారికి ఇదో గమనించదగ్గ అంశం గా మారుతోంది.

** తాజాగా జగన్ ప్రభుత్వం దిశా పోలీస్ స్టేషన్లు అన్నింటికీ అక్కడి మహిళా సిబ్బందికి స్కూటీ లను సమకూర్చింది. ఇది ఓ మంచి విషయం. పోలీస్ సిబ్బంది సొంత వాహనాల్లో వెళ్లి పంచాయితీలు చేయకుండా, ప్రభుత్వం సమకూర్చిన వాహనంలో హుందాగా వెళ్లేలా ప్రభుత్వ ఆలోచన చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా అభినందించదగ్గ విషయమే అయినా, ఎక్కడ కూడా రంగులు పిచ్చి మరోసారి బయటపడింది. సిబ్బందికి ఇచ్చిన స్కూటర్ లపై వైసీపీకి చెందిన మూడు రంగులు దర్శనమివ్వడం విశేషం. కంపెనీకి ఆర్డర్ పెట్టినప్పుడే వైసిపి రంగులు వచ్చేలా దానికి తగిన మార్పులు చేర్పులు చేసి స్కూటర్లను ఆర్డర్ ఇచ్చారు. సోమవారం అన్ని దిశ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఈ స్కూటర్ లు చూసి పోలీసు సిబ్బంది సైతం నవ్వుకున్నారు. ప్రజాధనాన్ని వినియోగించి అందించే వాహనాలకు పార్టీ ప్రచారం చేసుకోవడం ఇప్పుడు విపక్షాలకు పెద్ద ఆయుధమే. ఇటీవలే హైకోర్టు సైతం ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు ఎలా వేస్తారు అని, వెంటనే వాటన్నిటినీ తొలగించాలని ఆదేశాలు ఇవ్వడంతో వీటిని వేగంగా తొలగించారు. ఎప్పుడూ ఈ స్కూటర్ మీద సైతం హైకోర్టులో పిటిషన్ వేస్తే, మళ్లీ ఈ వాహనాల నుంచి వెనక్కు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఖర్చు కి అదనపు ఖర్చు… రంగుల పిచ్చికి ఈ ఖర్చు ఎవరి ఖాతాలో వేస్తారు ప్రజలు దీన్ని ఎలా భరిస్తారు అనేది ప్రభుత్వ పెద్దలు ఆలోచించినట్లుగా లేదు. దీనిపై ఇప్పుడు విపక్షాలు మళ్లీ కోర్టుకు వెళ్లి.. ఆర్డర్ ఇస్తే గానీ జగన్ శాంతించారు. దీనివల్ల సమయం ప్రభుత్వ డబ్బు ద్వారా అన్ని ఏకకాలంలో జరుగుతాయి. ఇది ప్రభుత్వానికి దెబ్బే తప్ప మంచి కాదు.. దీన్ని జగన్ గుర్తెరగాలి… ఈ రంగుల పిచ్చి నుంచి బయటకు రావాలి.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju