NewsOrbit
న్యూస్

ఓ పోలీసు బిడ్డా….నిన్ను మరవదు తెలుగు గడ్డ!నిజమైన ఖాకీ నువ్వేనయ్యా!

వృత్తి ధర్మాన్ని పాటిస్తూ పెడదోవ పట్టిన కొడుకులను శిక్షించే పోలీస్ తండ్రులను చాలా సినిమాల్లో చూశాం.అప్పట్లో ఈ కథాంశంతో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన కొండవీటి సింహం సూపర్ హిట్ కావటం తెలిసిందే.

ఎస్పీ రంజిత్ కుమార్ గా నటించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నేరాలకు అలవాటు పడ్డ తన కొడుకు మోహన్ బాబు ను చివర్లో చంపేయడం ఈ చిత్ర కథాంశం.తాజాగా కొడుకును చంపేయకపోయినా పోలీసులకు పట్టించిన ఘనతను కర్నూలు జిల్లాలో ఒక ఎస్సై సొంతం చేసుకున్నారు.చైనీయులు నిర్వహించే రుణయాప్ ల కంపెనీ వ్యవహారాలు తెలుగు రాష్ర్టాల్లో పర్యవేక్షించే కర్నూలు జిల్లాకు చెందిన నాగరాజు అనే వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేయడం తెలిసిందే. ఏఎస్ఐగా పనిచేస్తున్న తన తండ్రి పోలీసులకు కొడుకును పట్టించి డిపార్ట్మెంట్ చేత శభాష్ అనిపించుకున్న వైనమిది..వివరాల్లోకి వెళితే …కరోనా కష్టకాలంలో ఏర్పడ్డ ఆర్ధిక కష్టాలు గట్టెక్కటానికి పలువురు ల బారినపడి లబో దిబో మంటున్నారు.రుణయాప్ ల నిర్వాహకులు పెట్టే వత్తిడి తట్టుకోలేక కొందరు చిన్నవయస్సులోనే బలవన్మరణాలకు పాల్పడ్డారు. చైనా కంపెనీలు కేవలం ఆర్నెల్లలో రూ.21 వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు లెక్కలు తేలాయి. లోన్ యాప్ ల కేసులో రెండు రోజుల క్రితం చైనా దేశీయుడు ల్యాంబోను పోలీసులు అరెస్టు చేశారు.ఉభయ తెలుగు రాష్ట్రాలలో ల్యాంబో కంపెనీల ఆర్ధిక వ్యవహారాలను కర్నూలుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి పర్యవేక్షిస్తున్నాడు. అతని సోదరుడు ఈశ్వర్ కుమార్ కూడా ఇదే కంపెనీలో పని చేస్తున్నాడు. వీరి తండ్రి కర్నూలు జిల్లాలో ఏఎస్సైగా పనిచేస్తున్నారు. కాగా నాగరాజును రెండురోజుల క్రితం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాగరాజు అరెస్ట్ వెనుక అతని తండ్రి వృత్తి ధర్మాన్ని పాటించి కన్నకొడుకును పొలీసులకు పట్టించారు.

తండ్రే స్కెచ్ వేసి పట్టించాడు!ఎలాగంటే?

గత కొన్ని రోజులుగా రుణయాప్ లవార్తలు వింటున్ననాగరాజు తండ్రి తన కుమారుడి వ్యవహారాల్ని పరిశీలించటం మొదలెట్టారు. అతడిపై అనుమానం వచ్చింది. ఈలోగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నాగరాజు విషయంలో ఆయన్ను సంప్రదించారు. తను కన్నకుమారుడు పరోక్షంగా లక్షల మందిని మోసం చేశాడని నిర్ధారించుకున్నారు. ఈవిషయం కుమారుడికి చెప్పకుండా ఆయన, బెంగుళూరులో రుణయాప్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న తన కుమారుడిని కర్నూలు రావాలని కోరారు.3 రోజుల క్రితం కుమారుడు ఇంటికి వచ్చాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేంతవరకు కుమారుడు ఇల్లుదాటి బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడి… పోలీసులు రాగానే కుమారుడ్ని వారికి అప్పగించి అరెస్ట్ చేయించారు. పేగు బంధం కంటే వృత్తి బాధ్యత గొప్పదని భావించిన ఆయనకు సైబర్ క్రైమ్ పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.ఏఎస్సైగా పని చేస్తున్నతన వివరాలు బయటకు రానివ్వవద్దని ఆయన పోలీసు అధికారులను వేడుకున్నారు. పోలీసులు తమ్ముడు నాగరాజును అరెస్ట్ చేయటంతో అదే కంపెనీలో పని చేస్తున్న అన్న ఈశ్వర్ కుమార్ కూడా పోలీసులకు స్వఛ్చందంగా లొంగిపోయినట్లు తెలుస్తోంది.

 

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju