NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రామతీర్థం వద్ద మరో సారి ఉద్రిక్తత..బీజెపీ నేతల అరెస్టులు

 

విజయనగరం జిల్లా రామతీర్థం వద్ద మరో సారి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కొండపైకి ర్యాలీగా వెళ్లేందుకు బీజెపీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాథవ్, ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు విష్ణువర్థన్ రెడ్డి తదితర నేతలు, కార్యకర్తలను నెల్లిమర్ల వద్ద పోలీసులు నిలువరించారు. రామతీర్థం కొండపైకి అయిదుగురిని మత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పగా, అందరినీ అనుమతించాలని బీజెపీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ బీజెపీ నేతలు బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు, బీజెపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సోము వీర్రాజు, విష్ణువర్థన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగ మారింది. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా బీజెపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ర్యాలీగా వచ్చిన ఎమ్మెల్సీ మాధవ్ తో సహా పలువురు బిజెపి నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

రామతీర్థం వద్ద, విజయనగరం డివిజన్ లో ఈ నెలాఖరు వరకూ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. రామతీర్థం కూడలి నుండి దేవస్థానం వరకు, బోడికొండపై కొదండ రాముడి ఆలయం వద్ద పోలీసు బలగాలు పహారా కాస్తున్నాయి. సీతారామనిపేట కూడలి వద్ద వాహనాలను దారి మళ్లిస్తున్నారు. బోడికొండ మెట్ల వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. కొండపైకి ఆందోళనకారులు వెళ్లకుండా బారికేడ్లను సిద్దంగా ఉంచారు. వేలాది మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తున్నానన్నారు. ఏపిలో రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. ప్రభుత్వ ద్వంద వైఖరిపై ప్రజా పోరాటం చేస్తామని సోము వీర్రాజు అన్నారు. వైసీపీ, టీడీపీ నేతలను అనుమతించిన ప్రభుత్వం బీజెపి నేతలను ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించారు. రామతీర్థం ఆలయంలోకి తమను అనుమతించే వరకూ వదిలిపెట్టమని విష్ణువర్థన రెడ్డి అన్నారు. ఇక్కడి పరిణామాలపై బీజెపీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావు స్పందించారు. వైసీపీ, టీడీపీ నేతలకు అనుమతి ఇచ్చి బిజెపీ నేతలకు ఎందుకు అనుమతి ఇవ్వడంలేదని ప్రశ్నించారు. ఏపిలో బీజెపీని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని జీవీఎల్ ఆరోపించారు. ఏపి ప్రభుత్వం, పోలీసుల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.

 

Related posts

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?